ప్రశ్నించడం కోసమే జన సేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రశ్నించరేంటని కొందరు వెటకారం ఆడుతూ ఉంటే నాకు ఒళ్లు మండిపోతుంది. పవన్ కళ్యాణ్ ను ఆడిపోసుకోవడం తప్ప వాళ్లకి ఇంకో పని లేదా ఏంటని నాకు చిర్రెత్తుకొస్తూ ఉంటుంది. ఎవరిని పడితే వారిని ఎపుడు పడితే అపుడు ప్రశ్నించేయాలా ఏటి?
అయినా నాకు తెలవక అడుగుతాను... పవన్ కళ్యాణ్ ఎవరిని ప్రశ్నించాలట?
చంద్రబాబు నాయుణ్నా?
ఏమని ప్రశ్నించాలి?
రాజధాని కోసం రైతుల నుండి భూములు బలవంతంగా గుంజుకుంటే ఎలాగ? రైతులు ఎలా బతకాలి ? అని ప్రశ్నించాలా?
చెప్పడం వీజీయే. ప్రశ్నించడం కట్టం.
ఒక వేళ కొందరు అడుగుతోన్నట్లు పవన్ కళ్యాన్ గట్టిగా ప్రశ్నించారనుకోండి చంద్రబాబు జవాబు చెప్పకపోతే పవర్ స్టార్ ఏం చేయాలి?
అయినా ముఖ్యమంత్రి పోస్టులో ఉన్న వాళ్లని ప్రశ్నిస్తే వాళ్లు ఊరుకుంటారా ఏటి?
పవన్ కల్యాణ్ నిజంగానే ప్రశ్నిస్తారు.
దానికి టైమ్ రావాలి.
టైమ్ రాకుండా ఊరికే పెబుత్వం చెవిలో జోరీగ లాగ ప్రశ్నిస్తూనే పోతే పెబుత్వంలో ఉన్నోళ్లు ఊరుకోరు తెలుసా?
తీసుకెళ్లి బొక్కలోకి తోస్తారు.
ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పాపం అప్పుడప్పుడూ ప్రశ్నిస్తూనే ఉన్నారు కదా.
చంద్రబాబు నాయుడి ప్రభుత్వం రైతుల నుండి బలవంతంగా బూవులు లాక్కుంటే..రైతులు లబో దిబో మంటే.. పవన్ కళ్యాణ్ టిడిపి మంత్రులనీ..ఎంపీలనీ కొన్ని ప్రశ్నలు వేశారు కదా.
ఆ తర్వాత చంద్రబాబు రైతులకు చాలా మంచి చేస్తున్నారని పొగిడారనుకోండి అది వేరే విషయం.దాన్ని పక్కన పెట్టండి.
అయినా ప్రశ్నలు ఎవరు వేస్తారు?
ఏమీ తెలీని వాళ్లు ప్రశ్నలు వేస్తారు.
స్కూల్లో పిల్లలు తమకు తెలీనివి తెలుసుకోడానికి మాస్టార్లని ప్రశ్నిస్తారు.
మరి మా పవన్ కళ్యాణ్ కి అన్నీ తెలుసు కాబట్టే.. చంద్రబాబును ప్రశ్నించడం లేదు.
అదీ కాకుండా.. ఊరికే ప్రశ్నిస్తూ కూకుంటే..అక్కడ సినిమా లు ఎవరు తీస్తారు?
సినిమా షూటింగ్ లు ఏం కావాలి?
సినిమాలు లేకపోతే అభిమానులు ఏమైపోవాలి?
అభిమానులు లేకపోతే సినిమా థియేటర్లు ఏం చేయాలి?
ఇంత మంది సమస్యల్లో పడిపోతారనే పాపం పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం లేదు.
అలాగని ఎప్పటికీ ప్రశ్నించకుండా ఉండిపోరండీ బాబూ.
రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయనుకోండి..కొత్త సినిమాలు తీయడానికి కూసింత టైమ్ పడుతుంది కదా..అపుడు ఖాళీ దొరుకుతుందన్నమాట. అపుడు చూసుకోండి పవన్ కళ్యాన్ ప్రశ్నలపై ప్రశ్నలు అడుగుతారు.
అవసరమైతే ఢిల్లీలో కన్హయ్య కుమార్ నో.. ప్రొఫెసర్ సాయిబాబాగోరినో కలిసి ప్రశ్నించడం ఎలాగో నేర్చుకుని అయినా పవన్ కళ్యాణ్ గోరు ప్రెస్నిస్తారు.
మరంచేత ఎవరూ ఇంకేం మాట్లాడకండి.

-కవికాకి