<br/>- తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు పాఠాలు మొదలు పెట్టాడు`` తమ్ముళ్ళూ ఈ రోజు భూగోళ శాస్త్రం గురించి తెలుసుకుందాం. దీన్ని ఇంగ్లీష్‌లో జాగ్రఫీ అంటారు. హిందీలో ఏమంటారో తెలియదు. నిజానికి నాకు తెలుగు తప్పా ఏ భాషా సరిగా రాదు.దేవుడు మనకు ఈ భూమిని ఇచ్చాడు. ఈ భూమిలో రైతులు ధాన్యాన్ని పండిస్తారు. మనం డబ్బుని పండిస్తాం. ల్యాండ్ అంటే మనీ, మనీ వుంటే ల్యాండ్.. భూమి ఎక్కడుంటే అక్కడ తినేయాలి. గత 30 ఏళ్లుగా నేను భూమిలో పండిన అన్నం కంటే భూమినే ఎక్కువ తిన్నాను. నీళ్ళు తాగితే తీరేది దాహం , కానీ ఈ భూ దాహం ఎన్నటికీ తీరేది కాదు. మనం ఏదైనా నిర్మించామంటే, దాని వెనుక రియాలిటీ వుండాలి. రియాలిటీ అంటే సత్యం కాదు, స్థలం. అభివృద్ధి పేరుతో మనం అభివృద్ది అయ్యే సూత్రం ఇది. హైటెక్‌సిటీ నిర్మించినప్పుడు ఇదే చేసాను. మాదాపూర్‌లో వుండే పేదరైతులందరినీ వెళ్లగొట్టాను. ఆ భూముల్ని మనం పంచుకున్నాం.రాజధాని నిర్మాణమంటే కూడా ఇదే. రాజధాని అద్భుతం, మహాద్భుతం అంటూ వూదరగొట్టి మన భూవ్యాపారం చేసుకోవాలి. రైతుల భూములు లాక్కోని దివాళా తీయించాలి. ఏనుగులు నడుస్తున్నపుడు చీమలు చనిపోతాయి. తప్పదు మరి యూనివర్సిటీ లో వున్నప్పటినుంచి క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం నా అలవాటు. అలాగే రాజధాని ఎక్కడ నిర్మిస్తారో లీక్ చేసాను. మనవాళ్ళంతా కొనేసారు.నారాయణ నా అనుంగు మిత్రుడు, చదువుపేరుతో జనాల్ని ఎలా దోపిడిచేయాలో ఆయనకి బాగా తెలుసు. ప్రజాసేవచేసి ఇంకొంచెం ఎక్కువ దోపిడి చేస్తానని కోరిక కోరారు. సరేనన్నాను సేవ చేసి తరిస్తున్నాడు. సేవ అంటే ప్రజలకి షేవ్ చేసి గుండు కొట్టడం, ఎక్కడా పేదవాళ్ళకి ఒక్క ఫ్రీ సీటు కూడా ఇవ్వనివాడు ప్రజలకు సేవ చేస్తాడంటే నమ్మడానికి నేను ఏమైనా పిచ్చోడినా, నాకు రావాల్సంది నాకు ముడితే, ఆయన సేవ ఆయన చేసుకోవచ్చు.ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన పేరులోనే పులుపుంది కానీ మనిషి స్వీటు. అందని ద్రాక్ష పుల్లన అనుకునే రకం కాదు, ఎలాగైనా ద్రాక్షని అందుకునే పట్టుదల వున్నవాడు. నేను ముందే చెప్పాను. సునామి వచ్చినా బినామీల పేర్లు బయటికి రాకూడదని, నన్ను చూసి నేర్చుకోండి, నా బినామీలు ఎవరో ఇప్పటికీ నాకు తెలియదు, కానీ పుల్లారావు, నారాయణ మర్మం పాటించలేక వీధిన పడ్డారు``బాబు మాట్లాడుతూ వుండగా పిఏ వచ్చి `` మనలోకేష్ బాబు యవ్వారం లోకానికే తెలిసిపోయింది`` అన్నాడు`` ఏం తెలిసిపోయింది````మనవాడు బినామిల పేరుతో భూములు కొన్నాడని```` అంటే తండ్రికి తగ్గ తనయుడు కాదన్నమాట, వస్తా తమ్ముళ్ళు ఈ భూగోళం పాఠాలు మీకు కాదు, ముందు మా అబ్బాయికి నేర్పించాలి. నిశబ్దంగా భూమిని మింగడం కూడా రాకపోతే, ఇక రాజకీయాల్లో ఏం నేర్చుకున్నట్టు``అని బాబు వెళ్ళిపోయాడు.