బాబు టక్కు టమార విద్యలు

నంద్యాలలో ప్రజాస్వామ్య పరిరక్షణకి అన్ని చర్యలు తీసుకున్నాం’ అన్నాడు చంద్రబాబు విలేకరులు ఆశ్యర్యపోతూ ‘ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే ఏంటి సార్‌?’ అని అడిగారు. 
‘ప్రజల్ని భయపెట్టడమే అసలైన ప్రజాస్వామ్యం. అందుకే ఎన్నికలకి ముందే ఆ పని ప్రారంభించాను. నేను వేసిన రోడ్లపై నడబకూడదని చెప్పాను. నాకు ఓటు వేయకపోతే పింఛన్లు తీసుకోకూడదని చెప్పాను’ అన్నాడు బాబు
‘పింఛన్లు మీరు ఇవ్వడమేంటీ? అది ప్రభుత్వ సొమ్ము కదా?’ అడిగాడో విలేకరి ‘
‘ప్రభుత్వమంటే నేనే కదా, నేను ప్రభుత్వం. అందుకే ప్రభుత్వ సొమ్ముని నా సొంత సొమ్ములా భావిస్తాను’ అన్నాడు బాబు
నంద్యాలలో ఇంకా ఏవేం చేస్తున్నారు. ’ అడిగాడు విలేకరుల
‘ఎన్నికలప్పుడు డబ్బు పంచడం పాత పద్ధతే. ప్రచారంలో కూడా డబ్బు పంచడం కొత్త పద్ధతి. మాకు డబ్బుకి కొదవలేదు. అందుకే ముందుగా ప్రారంభించాం. మంత్రులందరిని రంగంలోకి దించాం. కులలు, వర్గాల వారిగా మంత్రులు వెళ్లి ఆయా కులాలు, వర్గాల వారిని కలుస్తున్నారు. వీలైతే ప్రలోభం, లేదంటే బెదిరింపు. అధికారం ఎలాగూ మా చేతిలేనే ఉంది. ముస్లింలను బుజ్జగించడానికి ఫరూక్‌కి పదవి ఇచ్చాం. మైనార్టీలకు వరాలు ఇస్తున్నాం’
‘గతంలో మీ పాలనలో మైనార్టీలకు ఏమైనా చేశారా?’
‘నేను ఎప్పుడు ఏమీ చేయను. చేస్తానని చెపుతూవుంటా. మైనార్టీలకు కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇవ్వని నేను మైనార్టీలకు ఏమైనా చేస్తానా? అలాగే ఆర్యవైశ్యులికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని వాగ్ధానం చేశా.. 
ఇంకా ఏమేం చేశారు?
సర్వే పేరుతో బిటెక్ విద్యార్థులను నియోజకవర్గం మొత్తం దించాను. వాళ్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి తెలుగుదేశానికి ఓటేయకపోతే అన్ని పథకాలు ఆగిపోతాయని ప్రచారం చేస్తారు.
ఇది మోసం కాదా? 
మోసం నా నైజం. సొంతమామనే మోసం చేశాను. ఇక ప్రజలు ఓ లెక్కా?
రైతులకు రుణమాఫీ చేస్తానన్నాను. చేశానా? వీలయితే రైతుల్ని మాఫీ చేస్తాను.
బాబొస్తే జాబొస్తుందన్నారు. వున్న జాబ్ లు పోతున్నాయి. 
మరి నంద్యాల ప్రజలు మీకు ఓటేస్తారని ఎలా అనుకుంటున్నారు
ఓటు వేయరని నాకు తెలుసు. అందుకే ఓటుని కొంటాను
అమ్ముడు పోవడానికి నంద్యాల ప్రజలు ఎమ్మెల్యేలు కాదు. ఎమ్మెల్యే ఎవరో డిసైడ్ చేసే జడ్జీలు. వాళ్లు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. వారు వుందని మీరు అనుకుంటున్నారు. వార్ ఎప్పుడో వన్ సైడ్ అయ్యింది. మీరు వీలయినంత తొందరగా ఒక కుర్చీ కొనుక్కుంటే మంచిది.
కుర్చీ ఎందుకు? కంగారుగా అడిగాడు బాబు
వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కుర్చీనుంచి కూడా దిగిపోతారు కాబట్టి

తాజా ఫోటోలు

Back to Top