ఉద్యోగాలు మైనెస్ నిరుద్యోగులు ఈక్వల్ టు కాకి లెక్కలు


ఉద్యోగాలు మైనెస్ నిరుద్యోగులు ఈక్వల్ టు కాకి లెక్కలు. ఈ ఈక్వెషన్ ఎక్కడా విన్నట్టు చదివినట్టూ అనిపించలేదు కదా. అవును మరి మన చంద్రబాబు గారి చదువులో తప్ప ఈతరహా ఈక్వెషన్లు ఎక్కడా కనిపించవు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎన్నికలు దగ్గర పడగానే పునాదిరాళ్లు, శంకుస్థాపనల బిజీలో కూరుకుపోయారు. ఆయన అధికారంలోకి వచ్చిన ఇన్నాళ్లుగా ఎన్ని పునాదిరాళ్లు కంపెనీలుగా రూపాంతరం చెందాయో తెలియదు కానీ ఆయన మాత్రం మొత్తం 8లక్షల ఉద్యోగాలు మాత్రం ఇచ్చేసానని చెప్పుకున్నారు. ఇది ప్రభుత్వ లెక్కా? లేక ఆయన గారి నోటి లెక్కా? లేకపోతే ఆకాశంలో కాకుల లెక్కా? నింగిలో నక్షత్రాల లెక్కా? చెట్టుమీది ఆకుల లెక్కా? అన్నది ఎవ్వరికీ అర్థం కాకుండా ఉంది. 
బాబుగారి లెక్కలే ఇలా ఉంటే ఇక ఆయన గారి పుత్రరత్నం అదృష్టవశాత్తు మన రాష్ట్ర ఆర్థికమంత్రి కాకుండా ఐటి మంత్రి అయి నెత్తిన పాలుపోసిన నారా లోకేష్ గారి లెక్క మరోలా ఉంది. ఐటి కొన్ని వేళ్లు, ఎలక్ట్రానిక్స్ కొన్నివేళ్లు, సర్వీస్ ఇండస్ట్రీలో కొన్ని వేళ్లు అని చెబుతాడీయన. వేల ఉద్యోగాలను వేళ్ల ఉద్యోగాలుగా అపోహపడక్కర్లేదు. ఆయన చెప్పే వేల ఉద్యోగాలను వేళ్లమీద లెక్కపెట్టినా కొన్ని వేళ్లు మిగిలిపోతున్నాయి అంటున్నారు మరి. 
సరే ముఖ్యమంత్రిగారూ ప్లస్ ఐటి మంత్రిగారూ చెప్పినట్లు వేలూ, లక్షల కొద్దీ ఉద్యోగాలు ఇచ్చేసారు అనే అనుకుందాం. ఈ లెక్కను కాస్త ఈక్వెషన్ లో చెప్పమని అడుగుదాం. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఎందరు? అందులో ఉద్యోగాలు ఎంతమందికి వచ్చాయి?అందులో ప్రభుత్వోద్యాగాలు ఎన్ని? ప్రైవేటు రంగంలో కల్పించిన అవకాశాలెన్ని? బాబుగారు ఆయనగారి అబ్బాయిగారు తెచ్చిన కంపెనీలెన్ని? అవి కల్పించిన ఉద్యోగాలెన్ని? ఇంత మందికి ఉద్యోగాలు కల్పించేయగా ఇక మిగిలిన నిరుద్యోగులెందరు? బాబిచ్చిన ఉద్యోగాల్లోంచి నిరుద్యోగులను మైనెస్ చేయగా మిగిలిన నిరుద్యోగులెందరు? వారిలో ఎందరికి బాబుగారి నిరుద్యోగభృతి అందుతోంది? కాస్త ఈలెక్క ఎవరైనా చెప్పగలరా? ఉద్యోగాల చిక్కు ముడి విప్పగలరా? ఈ ఈక్వెషన్ ను సాల్వ్ చేయగలరా? 
 

తాజా వీడియోలు

Back to Top