బాబునార్ బాగోతం

కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి అది. భేతాళుడు వేటకై వచ్చిన విక్రమార్కుడి భుజం మీదకెక్కి రాజా నీకొక కధ చెప్తా అంటూ చెప్పసాగింది!

బాబ్ నార్ అనే అతను ముఖ్య ఉద్యోగం కోసం అప్లయి చేస్తూ రాజధాని నిర్మాణం, రుణమాఫీ, మరియు ప్రాజెక్ట్ల నిర్మాణంలో తనకి ఏనాడు లేని అనుభవాలు రెజ్యూమ్ లో పొందుపరచి, ఇంటర్వ్యూలో తనకి చేతగాని పనులు చేతవునని, రాజధానిని ఇంద్ర నగరాన్ని తలదన్నేట్టు కడతాననిను, రాష్ట్రాన్ని దేశంలోనే ప్రధమ స్థానంలో కూర్చోపెడతానని చెప్పి ఉద్యోగం సంపాదించాడు. దీనికి వంతగా అతనికి రిఫరెన్సులు ఇచ్చిన పావణం లాంటి వాల్లు కూడా ఇతను అంత మేధావి ఇంత అనుభవశాలి అంటూ ఊదర కొట్టి ఇతనికే ఉద్యోగం వచ్చేట్టు చేసారు.

సరే చాలామంది కన్సల్టెంట్స్ లాగా ఉండటం మూడు రోజులు సొంత ఊర్లో, వారానికి నాలుగు రోజులు ఉద్యోగం చేసే సిటీలో. తను ఇంటర్వ్యూలో కోసిన కోతల్లో, రెజ్యూమ్ లో పెట్టినటువంటి అనుభవాలతో చిటికెలో చేసి చూపిస్తానన్న ముఖ్యమైన తన కంపెనీలోని ఉద్యోగులకి రుణ మాఫీ గాని, మహిళా ఉద్యోగుల పొదుపు,  రుణమాఫీని గాని, ప్రతి ఇంటికీ ఉద్యోగం గాని, నిరుద్యోగ భృతిని కాని అమలు చెయ్యలేక ప్రాజెక్ట్ రిపోర్టులని తారు మారు చేసి చూపించడం కంపెనీలోని అందరికీ తెలిసిపోయింది. ఇంకా, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా అతిగా చెస్తూ దొంగ బిల్లులు క్లెయిమ్ చేసుకుంటున్నట్లు కంపెనీకి తెలిసింది. అస్సలు పని చెయ్యకుండానే పనిచేసినట్లు, ఒవర్ టైం చేసినట్లు కూడా టైం షీట్లు సబ్మిట్ చేసాడు. ఇక రాజధాని విషయమైతే మరీను. ఆడిగిన వారికి అడగని వారికి సింగపూరని, టోక్యో అని, షాంగై అని కబుర్లు చెప్పుకుంటూ వేల ఎకరాల పచ్చని భూముల్ని రైతుల దగ్గర్నుండి మోసగించి, బెదిరించి, పంటలను కాల్చి అవసరం లేని దానికన్నా ఎక్కువగా తీసుకుని తన బినామీలకి కట్టబెట్టి చేస్తున్న మోసాలను తన ప్రత్యర్ధిగా ఉన్న న్యూస్ లెటర్ బయటపెట్టడంతో మల్టి నేషనల్ కంపెనీ హెడ్ కార్టర్సుకి తెలిసిపోయింది. ఈ విషయాల్ని మరుగుపర్చడానికి తన ప్రత్యర్ధి ఉద్యోగుల్ని సంతలో పశువుల మాదిరిగా కొనడం మొదులుపెట్టాడు.

ఈలోపు, సొంత నగరంలో తన పని సులువు చేసుకునేందుకు పని వేరేవాళ్ళతో చేయించే ఉద్దేశంతో డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికిపోయి తన బిచానాని కంపెనీ ఉన్న నగరానికే మార్చి కంపెనీ కోసం దాని ఉద్యోగుల కోసం ఎంత కష్టపడుతున్నాడో ఇంకెంత త్యాగం చేస్తున్నాడోనని తన కింద పనిచేసే న్యూస్ లెటర్ల ద్వార ఒకటే బాకా కొట్టుకుంటున్నాడు.

తన సుద్దపప్పు లాంటి లోకేశమనే కొడుకు వారి నాయన గారు సొంత ఊరిలో లేకపోవడం వల్ల కొత్తగా పుట్టిన తన మనవడ్ని ముద్దాటానికి ఎంత కష్టమైతుందో, అది ఎంత త్యాగమోనని ప్రచారం చెయ్యడం, బాబ్ నార్ వారి కింద పనిచేసేవాల్లు, న్యూస్ మీడియా కూడా అదే రేంజులో ప్రచారం షురూ చేసింది.

భేతాళుడు ఇంతవరకూ కధ చెప్పిన తర్వాత "రాజా నేను మూడు ప్రశ్నలు అడుగుతాను, సమాధానం తెలిసీ చెప్పకపోయావో నీ తల వేయి ముక్కలవుతుంది" అన్నాడు. దానికి విక్రమార్కుడు అడుగు భేతాళా అని అన్నాడు.

భేతాళుడు ప్రశ్నలిలా అడిగాడు:

1. బాబ్ తప్పుడు రెజ్యూమ్ పెట్టి, అలవిగాని హామీలిచ్చినా బాబ్ నార్కి కంపెనీ ఎందుకు ఉద్యోగమిచ్చింది?

2. బాబ్ తన ప్రత్యర్ధి ఉద్యోగులని సంతలో పశువుల్లా కొనుక్కుని తనవైపుకి తిప్పుకుంటున్నా కంపెనీ ఎందుకు ఏమీ చెయ్యలేదు?

3. తన మనవడితో బాబ్ ఎందుకు ఆడుకోలేకపోతున్నారు?

భేతాళుడి ప్రశ్నలకి విక్రమార్కుడు ఈ విధంగా సమాధానాలిచ్చాడు:

1. ప్రపంచంలో పుట్టిన ప్రతివాల్లు ఎంతో కొంత అబద్ధం చెప్పి బతుకీడుస్తుంటారు. కాని, బాబ్ ఇలాంటి తప్పుడు రెజ్యూమ్ లలో, అలవిగాని హామీలలో ప్రపంచంలోనే అగ్రగణ్యుడు. ఇంకా చెప్పాలంటే ప్రపంచానికే పాఠాలు చెప్పానంటాడు తన బట్లర్ ఇంగ్లీషుతో. తనని నమ్మే పచ్చ గొర్రెలు, సాఫ్టువేర్ బ్రమ్మీలు అనేకం. ఇక కంపెనీ మోసపోవడంలో ఆశ్చర్యమేమీలేదు!

2. బాబ్ తన ప్రత్యర్ధి ఉద్యోగులని సంతలో పశువుల్లా కొనుక్కున్నా కంపెనీ ఏమీ చెయ్యలేదు ఎందుకంటే వాల్లని ఉద్యోగాల్లోంచి తీసెయ్యాల్సిన అత్యున్నత స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఆయన కులానికే చెందినవాడే కాకుండా మా కులం ఎప్పుడూ అధికారంలో ఉండాలి అనే రకం. ఆయన వీళ్లని ఉద్యోగాల్లోంచి తీసెయ్యడు కాక తీసెయ్యడు. తీసెస్తే మళ్లీ వీరు ప్రవేశ పరీక్షలో పాసుగారని వాల్లకి బాగా తెలుసు.

3. ఇక తన మనవడితో బాబ్ ఎందుకు ఆడుకోలేకపోతున్నాడంటే కక్కుర్తిపడి తన పని సులువు చేసుకునేందుకు పని వేరేవాళ్ళతో చేయించే ఉద్దేశంతో  కొనడానికి ప్రయత్నించి డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికుండకపోతే ఈ సమస్య ఉండేది కాదు. ఇలా పట్టుకున్న వ్యక్తి కూడా సామాన్యుడు కాదు. బాబ్ గారి జుట్టు ఆ వ్యక్తి చేతుల్లో ఉంది మరి. నోరెత్తడానికి కూడా భయం బాబ్ గారికిప్పుడు. మరి కోడలేమో మనవడ్ని తీసుకుని తన కంపెనీ ఉండే నగరానికి రమ్మంటే అక్కడ సౌకర్యాలు సరిగ్గా లేవు నేను రానన్నదంట. బాబేమో కేసులకి భయపడి సొంత నగరానికి రాలేడు!

విక్రమార్కుడి సమాధానాలకి భెతాలుడు ఆశ్చర్యపోయి ఇలాగ్గూడా జరుగుద్దా అని నోరెల్లబెట్టి ఏమి చెయ్యాలో తోచక విక్రమార్కుడి భుజం మీదనుండి ఒక్కసారిగా జారి పడి పిచ్చి కేకలేసుకుంటూ దిక్కులు చూడకుండా పరిగెత్తాడు! :)

--- గురవా రెడ్డి, అట్లాంటా
Back to Top