మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు ప్రమాదం

 కోతుల గుంపు ఎదురుపడటంతో బైక్‌ బోల్తా.. 

తలకు, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు

తూర్పు గోదావ‌రి జిల్లా: వైయస్సార్‌సీపీ కొవ్వూరు నియోజకవర్గం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మంగళవారం ఉదయం ప్రమాదానికి గురయ్యారు. తన పొలం నుంచి ఇంటికి వస్తున్న సమయంలో కోతుల గుంపు ఎదురుపడటంతో బైక్‌ అదుపుతప్పి తిరగబడింది. ఈ ఘటనలో తలకు, చేతులకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను రాజమహేంద్రవరంలోని ఆదర్శ్‌ ఆసుపత్రికి తరలించారు.

 ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన వైయస్సార్‌సీపీ నేతలు

చికిత్స పొందుతున్న తలారి వెంకట్రావును వైయస్సార్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తోట రామకృష్ణ, మార్గాని సురేష్‌, మార్గాని రాము, చిటికిన తరుణ్‌ తదితరులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. తలారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆసుపత్రి ప్రధాన వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తలారి వెంకట్రావు త్వరగా కోలుకోవాలని పార్టీ నేతలు ఆకాంక్షించారు.
 

Back to Top