ఓటు అడిగే నైతిక హ‌క్కు వైయ‌స్ఆర్‌సీపీకే ఉంది

వైయ‌స్ఆర్‌సీపీ ఉత్త‌రాంధ్ర‌ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి

విజ‌య‌న‌గ‌రం:  ప్రజలవద్దకు వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులకు మాత్రమే ఉందని, నాలుగేళ్లలో మన ప్రభుత్వం చేసిన మేలును ఇంటింటికీ వెళ్లి ధైర్యంగా చెప్పగలుగుతున్నామని వైయ‌స్ఆర్‌సీపీ ఉత్త‌రాంధ్ర‌ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఏ నాయకుడైనా ఓ జిల్లాకు వెళ్లినప్పుడు మేం ఇక్కడ చేసిన పనులివి! చేయబోయే పనులివి!! అని చెప్పుకుంటాడని, మొన్న జిల్లాకు చంద్రబాబు వచ్చినప్పుడు కొన్ని చోట్ల ఆగకుండా వెళ్లిపోయాడని, ఆయన హయాంలో ఏం చేశారో చెప్పుకోలేక అధికార పార్టీ నేతలపై విమర్శలకు పరిమితమవుతున్నారని విమర్శించారు. విజయనగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీనివాసరావు  అధ్య‌క్ష‌త‌న ఏర్పాటు చేసిన సమావేశంలో  ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మాటలతో కాలక్షేపం చేసే నాయకుడైతే..ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన చేతలతో మేలైన పాలన అందిస్తున్నారని, అటువంటి యువనేతకు మరింత మద్దతిస్తే అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని పేర్కొన్నారు.  రాష్ట్రంలో జరుగుతున్న ప్రజారంజక పాలన చూసి ఓర్వలేని చంద్రబాబు అండ్‌ టీడీపీ టీమ్‌ తెల్లవారు లేచినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఏవిధంగా అభాసు పాలు చేయాలని చూస్తున్నారే తప్ప.. వారి హయాంలో జరిగిన మోసపూరిత పాలనపై ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు. ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన డ్వాక్రా రుణాల మాఫీ హామీని అమలు చేయలేకపోయారని విమర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైయ‌స్ఆర్‌ ఆసరా పేరిట డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తూ మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తున్న విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిపై చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని, వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాలనను వేలెత్తి చూపించే అర్హత టీడీపీ లేదన్నారు.   

Back to Top