అనంతపురం: టీడీపీ ఎత్తుల్ని చిత్తుచేస్తూ.. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ ఘన విజయం సాధించింది. అనంతపురం మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ తిరుగులేని విజయం సాధించింది. కమిటీ ఎన్నికల్లో పోటీపడిన ఐదుగురు వైయస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికై క్లిన్‌స్వీప్ చేశారు. టీడీపీ ప్రలోభాలు పెడుతూ బెదిరించినా తలొగ్గకుండా నిజాయతీ చాటిన వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు. ఓటుకి నోటు ఇవ్వబోయిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల తీర్పు చెంపపెట్టు లాంటిది. చంద్రబాబు కుట్రలని సమర్థంగా తిప్పికొట్టిన వైయస్‌ఆర్‌సీపీ సభ్యులను పార్టీ నేతలు అభినందించారు.