వైయ‌స్ఆర్‌ సీపీ ట్విట్టర్ అకౌంట్ రిస్టోర్.. 

తాడేప‌ల్లి:  ఇటీవల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వైయ‌స్ఆర్‌సీపీ ట్విట్టర్ ఖాతాలో క్రిప్టో కరెన్సీకి చెందిన వార్తలను పోస్ట్ చేశారు. అంతేకాకుండా ప్రొఫైల్ ఫోటోగా కోతి బొమ్మను పెట్టారు. శుక్రవారం అర్ధరాత్రి తమ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైనట్లు వైయ‌స్ఆర్‌సీపీ సాంకేతిక బృందం గుర్తించింది. దీంతో వెంటనే ట్విట్టర్ టెక్నికల్ సపోర్ట్ టీమ్‌కు సమాచారం అందించింది. తీవ్రంగా శ్రమించిన ట్విట్టర్ టీమ్ ఆదివారం రాత్రి వైయ‌స్ఆర్‌సీపీ ఖాతాను పునరుద్ధరించింది.

ఈ నేపథ్యంలో తమ ఖాతా రిస్టోర్ కావడంపై వైయ‌స్ఆర్‌ సీపీ స్పందించింది. హ్యాకింగ్ అనంతరం తొలి ట్వీట్ చేసింది. ‘గతంలో ఎన్నడూ లేని విధంగా మా ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. గత 36 గంటలుగా మా ట్విట్టర్ ఖాతా మా అధీనంలో లేదు. ఇప్పుడు మా ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించారు. ఈ సహాయానికి ట్విట్టర్ మద్దతు విభాగానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం’ అని వైయ‌స్ఆర్‌సీపీ ట్వీట్ చేసింది. 

Back to Top