కొత్తగణేషునిపాడులో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు

వైయస్‌ఆర్‌ సీపీకి ఓటేశారని బీసీ మహిళల ఇళ్లు ధ్వంసం

బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన కాసు మ‌హేష్‌, అనిల్‌ కాన్వాయ్‌పై రాళ్లు, క‌ర్ర‌లతో దాడి

పల్నాడు: పల్నాడు జిల్లా కొత్తగణేషునిపాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేశారని బీసీ మహిళల ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. బీసీ మహిళల ఇళ్లను, ఇంటిలోని సామ‌గ్రిని, బైక్‌లు, ఆటోలను పూర్తిగా ధ్వంసం చేశారు. టీడీపీ కార్య‌క‌ర్త‌ల బీభ‌త్సంతో భ‌యాందోళ‌న‌కు గురై రాత్రంతా మహిళలు ఓ గుడిసెలో తలదాచుకున్నారు. విషయం తెలియడంతో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులు కాసు మహేష్‌రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ బాధితులను పరామర్శించేందుకు కొత్తగణేషునిపాడుకు వెళ్లారు. ధ్వంసమైన ఇళ్లను పరిశీలించి, బాధితులను ఓదార్చారు. అప్పటికే గ్రామాన్ని చుట్టుముట్టిన టీడీపీ గూండాలు.. కాసు మహేష్‌రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కాన్వాయ్‌పై రాళ్లు, క‌ర్ర‌లతో దాడి చేశారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. కేంద్ర బలగాల సాయంతో కాన్వాయ్‌ తరలించారు.  

Back to Top