హామీలు అమ‌లు చేత‌కాక డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి ఆరె శ్యామ‌ల ట్వీట్‌

తూర్పుగోదావ‌రి జిల్లా: ఎన్నిక‌ల ముందు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌డం చేత‌గాని చంద్ర‌బాబు ప్ర‌జ‌లు అడుగుతున్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి ఆరె శ్యామ‌ల మండిప‌డ్డారు. కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి అక్ర‌మ అరెస్టును ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ప్ర‌జ‌ల త‌ర‌పున ప్ర‌శ్నించే వారిపై ఏమాత్రం సంబంధంలేని అక్ర‌మ కేసులు పెట్టి క‌క్ష‌గ‌ట్టి వేధిస్తున్నాడు అందుకు తాజా ఉదాహ‌ర‌ణ మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్ద‌న్‌ రెడ్డి అరెస్టు అని గుర్తు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా కాకాణి గారికి ఏమాత్రం సంబంధం లేని కేసులో ప్ర‌భుత్వ పెద్ద‌లు ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఆయ‌న‌ను అరెస్టు చేయించ‌డం దుర్మార్గం అంటూ శ్యామ‌ల ట్వీట్ చేశారు.

Back to Top