అనంతపురం : టీడీపీకి నిజమైన వారసులైన బాలకృష్ణ దబిడి..దిబిడి అంటూ తిరుగుతున్నారని, జూనియర్ ఎన్టీఆర్ను దూరం పెట్టారని వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు డాక్టర్ శైలజానాథ్ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి, ఆయనకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి టీడీపీకి వారసుడు కాదని, అసలు వారసుడు బాలకృష్ణ దబిడి.. దిబిడి అంటూ తిరుగుతున్నారంటూ శైలజానాథ్ ఎద్దేవా చేశారు. కడపలో నిర్వహిస్తున్న టీడీపీది మహా నాడు కాదు... దగా నాడు అంటూ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. `ఈ రోజు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తూ ఉంటుందని, ఆయనకు జరిగిన అన్యాయంపై మహానాడులో చర్చించాలి. ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబు చెప్పాలి. పేదల సంక్షేమ పథకాలు ఆపేసి... విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారు. రెండు ఎకరాల నుంచి లక్ష కోట్లకు చంద్రబాబు ఆస్తులు పెరిగాయి. ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారు. 1.30 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి పేదలకు పైసా ఇవ్వలేదు. పేదల భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పుజెప్పుతున్నారు. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని మహానాడులో తీర్మానం చేస్తారా?. టీడీపీలో సీనియర్లకు మంగళం పాడారు. చంద్రబాబును కూడా మారుస్తారేమోనని అనుమానంగా ఉంది. టీడీపీలో ఎన్టీఆర్‌నే గద్దె దించారు? చంద్రబాబు ఎంత?’’ అని శైలజానాథ్ వ్యాఖ్యానించారు.