నేడు పులివెందులకు వైయ‌స్‌ జగన్ 

మూడు రోజుల పర్యటన  

వైయ‌స్ఆర్ జిల్లా : మా­జీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 23 నుంచి మూడు రోజులపాటు వైయ‌స్ఆర్ కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఆయన మంగళవారం సా­యంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తా­రు. 

బుధవారం ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని ప్రేయర్‌ హాల్‌లో జరిగే క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని భాకరాపేట క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. గురువారం ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్‌ సందర్భంగా సీఎస్‌ఐ చర్చిలో జరిగే ప్రార్థ‌న‌ల్లో పాల్గొంటారు.  

Back to Top