కాకాణి కుటుంబ స‌భ్యుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ప‌రామ‌ర్శ‌

నెల్లూరు:  మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి కుటుంబ స‌భ్యుల‌ను వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ప‌రామ‌ర్శించారు.   మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ లీగ‌ల్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు మ‌నోహ‌న్‌రెడ్డిలు మంగ‌ళ‌వారం కాకాణి కూతురు పూజిత తో మాట్లాడి ఆమెకి దైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం కాకాణి పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తుంద‌ని వారు మండిప‌డ్డారు. నోటీసులు ఇవ్వాల్సిన కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశార‌ని త‌ప్పుప‌ట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు దోచుకోవడం.. దాచుకోవడం.. పంచుకోవడం అన్నట్లు వ్యవహరిస్తున్నార‌ని ఆక్షేపించారు.
 

Back to Top