కమిటీల నియామకంపై నాయకులంతా సీరియస్‌గా దృష్టిపెట్టాలి

వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి 

పార్టీ నాయకులంతా ఫోకస్‌తో పనిచేయాలి

ఫిబ్రవరి మొదటివారం కల్లా కమిటీల నియామకాలు పూర్తవ్వాలి

డేటా ప్రొఫైలింగ్‌ పక్కగా జరగాలి

కమిటీల నియామకంపై పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ అందుబాటులోకి వచ్చింది

కమిటీల నియామకం కార్యక్రమం స్పెషల్ డ్రైవ్ లా ముందుకు తీసుకెళ్ళాలి

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో  పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్‌ కాన్ఫరెన్స్

తాడేప‌ల్లి:  క‌మిటీల నియామ‌కంపై నాయ‌కులంతా సీరియ‌స్‌గా దృష్టి పెట్టాల‌ని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఆదివారం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో  పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్‌ కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ సమావేశంలో  సజ్జల రామకృష్ణారెడ్డి...ఏమన్నారంటే..

వైయ‌స్ఆర్‌సీపీ కమిటీల నిర్మాణంపై నాయకులంతా సీరియస్‌గా దృష్టిపెట్టాలి. ఇది ఒక స్పెషల్ డ్రైవ్‌ లా ముందుకు తీసుకెళ్ళాలి. అందరూ ఫోకస్‌తో పనిచేయాలి. పార్టీ కార్యక్రమాలతో పాటు కమిటీల నిర్మాణం అనేది కూడా అత్యంత ప్రాధాన్యమైనదని మన నాయకుడు జగన్‌ గారు ప్రత్యేకంగా చెప్పారు. కమిటీలలో నియామకాలు నిర్మాణాత్మకంగా జరగాలి, మొక్కుబడిగా ఉండకూడదని అధినేత జగన్‌ గారు చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారంకల్లా కమిటీలన్నీ నియామకాలు పూర్తి అవ్వాలి. విలేజ్‌, వార్డు కమిటీలు త్వరగా పూర్తిచేయాలి, డేటా అంతా ఎలాంటి తప్పులు లేకుండా సరిగా ఉండాలి. డేటా ప్రొఫైలింగ్‌ సరిగా ఉంటే మనకు భవిష్యత్ లో అనేక ఉపయోగాలు ఉంటాయి, పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం జరుగుతుంది. దాదాపు 15 లక్షల మంది వైయ‌స్ఆర్‌సీపీ సైన్యానికి కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం నేరుగా అందేలా ప్రణాళికలు సిద్దం చేశాం. ఇదంతా కూడా ఆర్గనైజ్డ్‌ సోల్జర్స్ ను రెడీ చేసే కార్యక్రమంలో భాగమే. ఇప్పటికే ప్రతి నియోజకవర్గం నుంచి డిజిటల్ మేనేజర్లు కూడా అందుబాటులో ఉన్నారు. కమిటీల నియామకంపై నాయకులకు అవసరమైన ఓరియెంటేషన్‌ కూడా ఇప్పటికే ఇస్తున్నాం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సైంటిఫిక్‌గా కమిటీల నియామకాలు పూర్తి అయ్యాయి. కడప పార్లమెంట్‌, వేమూరు, పుంగనూరు, మడకశిర ఇలా కొన్ని నియోజకవర్గాల్లో  పైలెట్‌ ప్రాజెక్ట్ గా మైక్రో లెవల్ లో కూడా అన్ని కమిటీలు పూర్తయ్యాయి. కమిటీల నియామకంపై పార్టీ సీనియర్‌ నాయకులు కొందరితో టాస్క్‌ ఫోర్స్‌ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశాం, వారంతా కూడా అవసరమైన సమావేశాలు నిర్వహించుకుని ఇది ఒక డ్రైవ్‌ లాగా చేయాలని నిర్ధేశించాం. కమిటీల నియామకాలు అన్నీ పక్కాగా జరిగితే ఏ ఎన్నికలు జరిగినా గెలుపు సులభతరమవుతుంది. పార్టీ అనుబంధ విభాగాల కమిటీలు పక్కగా ఉంటే పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా విజయవంతం చేయవచ్చు.

Back to Top