‘పద్మ’ పురస్కార గ్రహీతలకు వైయస్‌ జగన్‌ అభినందన

 తాడేప‌ల్లి:  రాష్ట్రం నుంచి పద్మ అవార్డులు అందుకున్న ప్రముఖులకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. తమ రంగాల్లో విశిష్ట సేవలందించినందుకు వారు పద్మ అవార్డులు అందుకోవడం పట్ల ఆయన హర్ష్యం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం పద్మ అవార్డులు స్వీకరించిన వారిలో రాష్ట్రానికి చెందిన మంద కృష్ణమాదిగ, కెఎల్‌ కృష్ణ, వదిరాజ్‌ రాఘవేంద్రాచార్య పంచముఖి ఉన్నారు.

Back to Top