అనంతపురం: ఎన్నికల సమయంలో హామీలను అమలు చేయకపోతే కాలర్ పట్టుకోవాలని నాడు కూటమి నేతలు అన్నారని, ఇవాళ ఎవరి కాలర్ పట్టుకోవాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సమాధానం చెప్పాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేంపల్లి సతీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. బుధవారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..`చంద్రబాబు అబద్ధాల కోరు.. మోసపూరిత హామీలతో ముఖ్యమంత్రి అయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేదు. చంద్రబాబు హయాంలో రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. వైయస్ జగన్ 67 లక్షల మంది కి పింఛన్లు ఇచ్చారు. చంద్రబాబు సర్కార్ మాత్రం 60 లక్షల మంది కి మాత్రమే పింఛన్లు ఇస్తోంది. వైయస్ఆర్‌సీపీ ఒత్తిడి తోనే చంద్రబాబు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారు. పిల్లలు ఉన్న తల్లులందరికీ తల్లికి వందనం ఆర్థిక సాయం అందలేదు. ఎన్నికల కు ముందు సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు... ఇప్పుడెందుకు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అందించలేదు?. హామీలను అమలు చేయకపోతే కాలర్ పట్టుకోవాలన్నారు. ఇప్పుడు ఎవరి కాలర్ పట్టుకోవాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చెప్పాలి. పాలనలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారు కనుకే వైయస్ జగన్ వెంట జనం వస్తున్నారు. దాన్ని జీర్ణించుకోలేక వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన లను టీడీపీ కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోంది` అని వేంపల్లి సతీష్ రెడ్డి ఆక్షేపించారు.