గోబెల్స్‌ ప్రచారం చేస్తే తప్పులు ఒప్పు కావు

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

చంద్రబాబును హింసిస్తున్నారంటూ టీడీపీ అబద్ధాలు ప్రచారం

కుట్రతో రాష్ట్ర ఖజానాకు వందల కోట్లు నష్టం కలిగించారు

దొంగలను పట్టుకుంటే ఎందుకంత హడావుడి?

ఒప్పందం చేసుకోలేదని సీమెన్స్‌ సంస్థ తెలిపింది

హవాలా వ్యవహారంపై ఈడీ కూడా విచారణ చేసింది

దేశంలో ఉండే చట్టాలకు చంద్రబాబు అతీతుడా? 

90 శాతం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ లేదని సీమెన్స్‌ స్పష్టం చేసింది

యువత పేరు చెప్పి దోచుకున్నారు

అన్ని ఆధారాలతో చంద్రబాబును అరెస్టు చేశారు

అరెస్టు నుంచి జైలుకు వెళ్లే వరకు చంద్రబాబుకు రాచమర్యాదలు

కుట్రలతో కూడిన యజ్ఞంలా ఆర్థిక అక్రమాలు చేశారు

షెల్‌ కంపెనీల ద్వారా వందల కోట్లు కొల్లగొట్టారు

అసలు దోచుకోవడానికే ఓ స్కీమ్‌ పెట్టారు

జాతీయ, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు కేస్‌ స్టడీగా స్కిల్‌ స్కాం

తాడేపల్లి: గోబెల్స్‌ ప్రచారం చేస్తే తప్పులు ఒప్పు కావని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కుట్రతో రాష్ట్ర ఖజానాకు వందల కోట్లు నష్టం కలిగించారని మండిపడ్డారు. దొంగలను పట్టుకుంటే ఎందుకంత హడావుడి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అబద్ధాలను నిజం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తప్పుపట్టారు. సీమెన్స్‌ కంపెనీ వాళ్లు మేం సీన్‌లోనే లేమని స్పష్టం చేశారని చెప్పారు. హవాలా వ్యవహారంపై ఈడీ కూడా విచారణ చేసిందని గుర్తు చేశారు. అన్ని ఆధారాలతో చంద్రబాబును అరెస్టు చేశారని తెలిపారు. యువత పేరు చెప్పి చంద్రబాబు దోచుకున్నారని, దోచుకోవడానికే ఒక స్కీం రూపొందించారని ఫైర్‌ అయ్యారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

అది మానవ హక్కుల ఉల్లంఘనా?:

 • చంద్రబాబు కేసులో సాక్షాధారాలున్నాయని కోర్టు జ్యుడిషియల్‌ కస్టడీకి పంపిన తర్వాత కూడా టీడీపీకి, చంద్రబాబుకు అనుకూలంగా ఎవరెవరో ఎల్లో మీడియాలో ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. 
 • చంద్రబాబు పెంచి పోషించిన వ్యవస్థల్లో బ్రోకర్లుంటారు. రాజకీయ నాయకులు ఉంటారు. ఇతర వ్యవస్థల్లో ప్రముఖులుంటారు. 
 • వారందరినీ బలవంతంగా దించి స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నారు. 
 • ప్రపంచం తలకిందులైనట్లు, అన్యాయంగా ఒక 73 ఏళ్ల వృద్ధుడిని హింసిస్తున్నట్లు ఒక చిత్రాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. 
 • అసలు విషయం ఏమిటి?. వీరు చేస్తున్న హడావుడి, హంగామా ఏంటి..? 
 • చిన్న పిల్లవాడ్ని అడిగినా ఒక కుట్రతో రాష్ట్ర ఖజానాకు వందల కోట్లు నష్టం కలిగించారని చెప్తారు. 
 • ప్రజల సొమ్ము రూ. 371 కోట్లు దోచేశారని అందరికీ తెలుస్తూనే ఉంది. 
 • అవన్నీ ఊహలా..? దొంగను పట్టుకుంటే అరెస్ట్‌ చేయడం మానవ హక్కులకు భంగం అంటే ఎలా..? 
 • హత్య చేసిన హంతకుడిని హత్యకు అధారాలుండి అరెస్ట్‌ చేస్తే అన్యాయం, ఘోరం జరిగిపోతుంది అంటే ఎలా..? 
 • పక్కా ఆధారాలతో ఏజెన్సీ రిమాండ్‌ రిపోర్ట్‌ ఇచ్చింది. ఆయన ప్రభుత్వంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నివేదిక ఇచ్చింది. మీ దగ్గర దోపిడీ జరిగిందని హెచ్చరించింది. 
 • దోపిడీ చేసిన వ్యక్తే అధికారంలో ఉండటంతో దాన్ని పక్కన పెట్టారు. ఆధారాలను తుడిచివేశారు. 
 • సెంట్రల్‌ ఎజెన్సీ ఆధారంగా ఏపీ సీఐడీ కేసు బుక్‌ చేసి అరెస్టులు చేసింది. 
 • ఆ తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్‌పై ప్రముఖంగా దృష్టి పెట్టింది. 
 • బయటకు పోయిన డబ్బు షెల్‌కంపెనీల ద్వారా చేరాల్సిన చోటికి చేర్చారు. 

అరెస్టయిన వ్యక్తితో స్టేట్‌మెంట్స్‌:

 • అత్యంత కీలకంగా ఏ కంపెనీ పేరైతే చెప్తున్నారో సీమెన్స్‌ వారు మాకు సంబంధమే లేదని చెప్తున్నారు. 
 • ఇంత జరిగిన తర్వాత కూడా ఈరోజుకీ సీమెన్స్‌ కంపెనీ గురించే మాట్లాడుతూనే ఉన్నారు. 
 • ఎవరైతే డిజిటెక్‌ సంస్థకు చెందిన వ్యక్తి అరెస్ట్‌ అయ్యాడో అతన్ని తీసుకొచ్చి బ్యానర్‌ హెడ్డింగులు పెడుతున్నారు.
 • మాకు సంబంధమే లేదు..అరెస్టే కాలేదంటున్నారు. చివరికి వారి దబాయింపు ఈడీకే అసలు మేం అరెస్ట్‌ చేశామా లేదా అనే అనుమానం వచ్చేలా ఉంది. 
 • ఎంత అబద్ధమైనా మేం చెప్తే నిజం అవుతుందనే గోబెల్స్‌ ప్రచారాన్ని పది రెట్లు పెంచి చేస్తున్నారు. 
 • ఇలా చేయడానికి సిగ్గు పడాలి.. ఏదన్నా ఉంటే న్యాయస్థానంలో మాట్లాడాలి. 
 • మేము ఏదన్నా చేస్తే కోర్టులో ఉంది.. అక్కడ మాట్లాడదాం అని వాళ్లు అనాల్సింది పోయి వాళ్ల దబాయింపులకు మేం జవాబు ఇవ్వాల్సి వస్తోంది. 
 • సీమెన్స్‌ గ్లోబల్‌ సంస్థ మేం అగ్రిమెంట్‌ చేసుకోలేదు.. మాకు సంబంధం లేదని చెప్తోంది. 
 • ఒక ఎంవోయు ద్వారా డబ్బు దోపిడీకి గురైందని వారు ఇంటర్నల్‌ ఇన్వెస్టిగేషన్‌ చేసి స్పష్టంగా చెప్తున్నారు. 
 • దానికి సంబంధించిన వ్యక్తి కూడా అరెస్ట్‌ అయ్యాడు. 
 • ఆ సంస్థే మాకు సంబంధం లేదంటే.. ఆ అగ్రిమెంట్‌ పేరు మీద ఇచ్చిన రూ.371 కోట్లు అన్ని నిబంధనలను ఉల్లంఘించి విడుదల చేశారు. 
 • ఆ డబ్బు వాళ్లు చెప్పిన సీమెన్స్‌కి కాకుండా డిజైన్‌ టెక్‌ కంపెనీకి వెళ్లాయి. 
 • సీమెన్స్‌ వారు మాకు డబ్బు రాలేదు అంటున్నారు. మేం అసలు ఒప్పందమే చేసుకోలేదు అంటున్నారు. 
 • మా దగ్గర పనిచేసే వారు మా కంపెనీ పేరును దుర్వినియోగం చేశాడని వారు చెప్తున్నారు. 
 • అసలు 90 శాతం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఎందుకు ఇస్తాం అని ప్రశ్నిస్తున్నారు. 
 • సీమెన్స్‌ ఇండియా అనే సంస్థకు అసలు సీఎస్‌ఆర్‌ కూడా లేదట. 
 • ఆ డబ్బంతా డిజైన్‌ టెక్‌కు వెళ్లాయి...అక్కడి నుంచి ఆ డబ్బు ఎక్కడికి వెళ్లింది..? 
 • మీరిచ్చిన డబ్బు మాకు రాలేదు అన్నాక..అగ్రిమెంట్‌ చేసుకోలేదని చెప్పాక అది కేసా కాదా..? దాని వెనుక క్రిమినల్‌ కుట్ర ఉందా లేదా..? 
 • బలమైన కేసా..కాదా? 
 • దీనికి పెద్ద చదువు...ఢిల్లీ నుంచి దిగిన కోట్ల విలువైన లాయర్లు చెప్పాల్సిన అవసరం లేదు. 
 • ఆ డబ్బు ఎక్కడికి పోయిందో ఈ మధ్య ఐటీ శాఖ నోటీసులు ఇస్తే కానీ తెలియలేదు. 
 • అందులో అనుమానం వచ్చి మీ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వండి అని ఇద్దరిని అడిగితే..రాత్రి రాత్రే దుబాయ్, అమెరికా పంపించేశారు. 
 • మనోజ్‌ వాసుదేవ్‌ అనే వ్యక్తికి అరెస్టులు, స్టేట్‌మెంట్లు పెద్ద విషయం కాదు. కానీ ఎందుకు పారిపోయాడు..? 
 • ఈడీ హవాలా పద్దతిలో వెళ్లిన సొమ్ము విషయంలో ఆస్తులు కూడా అటాచ్‌ చేశారు. 

అందరితో అన్యాయం అనిపించగలడు:

 • చంద్రబాబుని అరెస్ట్‌ చేసిన తర్వాత జడ్జిగారి ముందు ప్రవేశపెట్టారు. 
 • అక్కడ పది గంటల పాటు వాదనలు విన్నాక ఆయనకు రిమాండ్‌ విధించారు. 
 • అన్ని ఆధారాలుంటే.. మీ వైపు నుంచి ఏం చెప్తారు అని అడగడానికి ప్రయత్నం చేస్తే నానా యాగీ చేస్తున్నారు. 
 • ఆయనకు ఉన్న పరపతి చాలా ఎక్కువ. రాత్రికి రాత్రి దేశాలు దాటించగలడు. కాశ్మిర్‌ నుంచి కన్యాకుమారి వరకూ ఇది అన్యాయం అని తన పండిన రిటైరైన రాజకీయ నాయకులతో స్టేట్‌మెంట్లు ఇప్పించగలడు. జాతీయ మీడియాలో ఏదో జరిగిపోతుందని కూడా చెప్పించగలడు. 
 • అలాంటి సామర్ధ్యం ఉండే చంద్రబాబు బయట ఉంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. 
 • ఇది యువత భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇలాంటిని వ్యక్తిని వదిలేయాలా..? 
 • ఈయన దేశంలో ఉండే రాజ్యాంగం, చట్టాలకు అతీతుడా..? 
 • ఈ భూప్రపంచంలో ఉన్న ఏ చట్టం కూడా ఈయనకు వర్తించదా..? 
 • ఆయన అసలు జైళ్లో ఉండటమే అతిపెద్ద ఘోరం అన్నట్లు మాట్లాడుతున్నారు. 
 • జైళ్లో ఉన్నా అతనికి బెస్ట్‌ సౌకర్యాలు ఇచ్చారు. అరెస్టు సమయంలో హెలికాఫ్టర్‌ పెడితే వద్దని రోడ్డు వెంట వచ్చాడు. 
 • సాధారణంగా అరెస్ట్‌ చేస్తే పోలీసు వాహనంలో తీసుకురావాలి. కానీ ఈయన్ను ఆయన వాహనంలోనే రానిచ్చారు. 
 • జ్యుడిషియల్‌ కస్టడీ ఇచ్చిన తరవాత కూడా ఆయన వాహనంలోనే రాజమండ్రి వెళ్లాడు. 
 • ఆయన వెళ్లే సరికి ఒక బ్లాక్‌ ఖాళీ చేసి పెట్టారు. 
 • ఇంటి భోజనం విషయంలో కూడా విచారణ ఎజెన్సీ అభ్యంతరం చెప్పలేదు. 
 • హౌస్‌ అరెస్టు కుదరదన్నారు..ఇంట్లో ఉంటే ఇక దాన్ని అరెస్ట్‌ ఎలా అవుతుంది..? 
 • ఇంత రాచమర్యాదలతో ఇవ్వాల్సిన దానకంటే ఎక్కువ మర్యాద ఇస్తుంటే కూడా ఎదురుదాడి చేస్తున్నారు. 
 • ఎదురుదాడితో ఘోరం జరిగిపోయిందని, అన్యాయంగా రాచిరంపాన పెడుతున్నారని సానుభూతి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. 
 • ఆయనతో నేను అంటూ ఏదో క్యాంపెయిన్‌ కూడా చేస్తున్నారు. 
 • ఇంకా ఏమేమి చేస్తారో.. అలిపిరి దాడి లాంటిది జరిగితే ఇలాంటి క్యాంపెయిన్‌ చేస్తే అర్ధం ఉంది. 
 • ఒక బలమైన నేరారోపణ కేసులో కూడా సానుభూతికి ప్రయత్నం చేసే వ్యక్తి ప్రపంచంలో చంద్రబాబు ఒక్కడే ఉంటాడేమో?
 • ప్రభుత్వంపై, మా పార్టీపై వ్యతిరేక ధోరణి రావాలని సానుభూతి డ్రామాలతో రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నాడు. 

స్కిల్‌ వ్యవహారంలో కుట్ర లేనిది ఎక్కడ?:

 • ఉన్న సమాచారం అంతా రిమాండ్‌ రిపోర్టులో ఉంది. వాదనలన్నీ అందరూ విన్నారు. 
 • ఆధారాలన్నీ ఉన్నాయి.. ఒక స్వతంత్ర సంస్థగా ఒక మీడియా సంస్థ చంద్రబాబును ప్రశ్నించాలి. 
 • జీఎస్టీ ద్వారా విషయం బయటకు వచ్చిన తర్వాత సీమెన్స్‌ గ్లోబల్‌ తన ఇన్వెస్టిగేషన్‌ రిపోర్టు 12న ఏప్రిల్‌ 2019లో ఇచ్చింది. అప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వమే ఉంది. 
 • 2014 సెప్టెంబర్‌లో చంద్రబాబు స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. దానికి ఎండీ సీఈవోగా గంటా సుబ్బారావు, సలహాదారుగా మాజీ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణను తీసుకొచ్చారు. 
 • 2014 అక్టోబర్‌లో ఇదే గంటా సుబ్బారావును ఎక్స్‌అఫిషియో సెక్రటరీ హైయర్‌ ఎడ్యుకేషన్‌కు పెట్టారు. 
 • తర్వాత 2015 జనవరి 30న ఆయన్ను సెక్రటరీ, స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ ఇన్నోవేషన్స్‌కి పెట్టారు. 
 • కానీ అప్పటికి ఆ శాఖే లేదు. దాంతో పాటు ఎక్స్‌అఫిషియో సెక్రటరీ టు సీఎంగా కూడా పెట్టారు.
 • అప్పుడు ఈయన్ను తీసుకెళ్లి సీఎంకి ఎందుకు లింక్‌ పెట్టారు..? 
 • ఆ తర్వాత స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ శాఖ జూన్‌ 26, 2015న ఏర్పాటు చేశారు. 
 • గంటా సుబ్బారావు అనే బయటి వ్యక్తి ఏపీ స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ ఎండీగా ప్రారంభమై సీఎం ఎక్స్‌అఫిషియో సెక్రటరీగా మారాడు. 
 • ఇతనే కార్పొరేషన్‌లో ప్రతిపాదనలు పెడతాడు..ఇతర పదవుల అధికారంతో తానే ఆమోదిస్తాడు. 
 • జూన్‌ 30న జీవో నంబర్‌ 4 విడుదల చేశారు. రూ.3300 కోట్ల ప్రాజెక్టులో సీమెన్స్‌ 90 శాతం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్, 10 శాతం ప్రభుత్వ వాటాగా జీవో ఇచ్చారు. 
 • టీడీపీ వారు మాట్లాడుతున్న దాంట్లో సాఫ్ట్‌వేర్‌ వచ్చిందంటూ ప్రచారం చేస్తున్నారు. 
 • అసలు ముందు రూ. 3 వేల కోట్ల సాఫ్ట్‌వేర్‌ ఏముంటుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. 
 • అది సాఫ్ట్‌వేర్‌ కాదు జీవోలో సీమెన్స్‌ వారు క్యాష్‌ 90 శాతం ఇస్తామనేది స్పష్టంగా కనిపిస్తోంది. 
 • ఆ తర్వాత తెలంగాణలో వీరు ఎంవోయూ చేసుకున్నారు. 
 • దీంట్లో ఫైనాన్సియల్‌ అసిస్టెన్స్‌ అంటూ ప్రస్తావించారు. జీవోలో గ్రాంట్‌ఇన్‌ ఎయిడ్‌ అంటూ.. ఒప్పందంలో ఫైనాన్సియల్‌ అసిస్టెన్స్‌ అంటున్నారు. 
 • ఈ ఒప్పందం అసలు ఏ రోజు చేసుకున్నారో డేట్‌ కూడా వేయకుండా చేసుకున్నారు.
 • ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో నోట్‌ ఫైల్‌ ఒకటి మూవ్‌ చేశారు. దాంట్లో ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి నిధులు విడుదల చేయాలంటూ చెప్పారు. 
 • ఎప్పుడైతే జీఎస్టీ శాఖ అక్రమాలను గుర్తించిందో అప్పుడు ఈ నోట్‌ ఫైల్‌ను మాయం చేసేశారు. 
 • అప్పట్లో సునీత అనే ఫైనాన్స్‌ సెక్రటరీ నిధుల విడుదల అంశాన్ని మరోసారి ఆలోచించాలని సూచించారు. 
 • ఫైనాన్స్‌ శాఖ వద్ద కనీసం ఎంవోయూ కూడా లేకుండానే నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 
 • అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన మీటింగులో నిధుల విడుదలపై నిర్ణయం జరిగింది కాబట్టి ఫైనాన్స్‌ శాఖ నిధులు విడుదల చేయాలంటూ సీఎస్‌ లేఖ రాశారు.
 • 2015 నుంచి 2016 వరకూ మొత్తం రూ. 371 కోట్లు పువ్వుల్లో పెట్టి బయటకు పంపించారు. 
 • అసలు జీవోలో తప్ప రూ. 3,300 కోట్ల ప్రస్తావన ఎక్కడా లేదు. 
 • రూ. 370 కోట్లకు రెక్కలు చాలా సులభంగా వస్తాయి. 
 • గంటా సుబ్బారావు, సుమన్‌ బోసు, డిజైన్‌ టెక్‌ వారు కలిసి ఇదంతా చేశారు. 
 • గంటా సుబ్బారావు అనే వ్యక్తిని ఎంట్రీ, ఆ తర్వాత టకటకా నాలుగైదు డిపార్ట్‌మెంట్లకు సెక్రటరీ అయ్యాడు. 
 • స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ శాఖ ఏర్పడకముందే అతన్ని సెక్రటరీగా పెట్టారు. 
 • విద్యాశాఖ వారిని బైపాస్‌ చేయడానికి సుబ్బారావును ఎడ్యుకేషన్‌ సెక్రటరీగా పెట్టారు. 
 • ఇందులో కుట్ర లేనిది ఎక్కడా..? రూ. 3,300 కోట్లలో 90 శాతం గాలికిపోయి...రూ.371 కోట్లు వాస్తవం అవుతుంది. 
 • ఓవర్‌ కాన్ఫిడెన్స్‌లో బాబు:
 • బహుశా ఎప్పుడూ నేనే ముఖ్యమంత్రిగా ఉంటానులే అనే ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఇదంతా చేశారు. 
 • ఇందులో చంద్రబాబు లేడని ఎలా అనుకుంటారు..ఆయన డైరెక్షన్‌లోనే అంతా జరిగిందని నోట్‌ఫైల్స్‌లో స్పష్టంగా ఉంది.  
 • సాక్షం లేకుండా తీసేయడమే నేరాన్ని ప్రూవ్‌ చేస్తుంది. ఉన్న షాడో ఫైల్‌లోనూ సీఎం నిర్ణయం అని స్పష్టంగా ఉంది. 
 • ఈ కుట్రకు మాస్టర్‌మైండ్‌ చంద్రబాబే. పాత్రదారులు మాత్రం బయట నుంచి వచ్చారు. అంతా ఆయనకు తెలిసే జరిగిందనడానికి ఆధారాలున్నాయి. 
 • నాకు తెలియదు అని తప్పించుకోడానికి కుదరని విధంగా ఆధారాలున్నాయి. 
 • ఈ మొత్తం వ్యవహారంలో సీమెన్స్‌ వారు ఏం ఇస్తారో తెలియదు..ఆ సెంటర్లలో ఏముంటాయో కూడా తెలియదు. దానికి సంబంధించిన డీపీఆర్‌ ఏమీ లేదు. 
 • అసలు సెంట్రల్‌ టూల్‌ డిజైన్‌ వారు ఏమిచ్చారో..దానికి దీనికి ఏం సంబంధమో తెలియడం లేదు. 
 • ఫైనాన్స్‌ సెక్రటరీ సునీత కూడా నోట్‌ఫైల్‌లో అసలు వారిచ్చే ఎక్విప్‌మెంట్‌ పాతవో కొత్తవో చూసుకోండి అని కూడా అన్నారు. 
 • రాష్ట్రమంతా కాదు..ముందు ఫైలట్‌ ప్రాజెక్టుగా చేద్దామన్నారు. 
 • వాటన్నిటీ పరిగణలోకి తీసుకోలేదు. 
 • అసలు దోచుకోడానికే ఒక స్కీం పెట్టడం, దోపిడీని సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్‌ చేయడం, ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. 
 • పెండ్యాల శ్రీనివాస్, మనోజ్‌ వాసుదేవ్‌ పార్ధసానీలు రాత్రికి రాత్రే ఎత్తి పార్సిల్‌ చేయడంలోనో చంద్రబాబు నేరం చేశాడు అనడానికి ఆధారంగా కనిపిస్తోంది. 
 • సరుకు రాలేదు...విడుదల చేసి షెల్‌ కంపెనీలకు వెళ్లిన సొమ్ము తిరిగి వెనక్కు రాలేదు. 
 • ఏఏ షెల్‌ కంపెనీల ద్వారా క్యాష్‌గా మార్చారో కూడా ఉంది. 
 • సింగపూర్‌కి చెందిన ఒక షెల్‌ కంపెనీకి రూ.100 కోట్లు పంపించారు. ఇది ఫెమా కిందకు కూడా వస్తుంది. 
 • టెండర్లకు వెళ్లకుండా, నేరుగా సొమ్ము జేబులో వేసుకోడానికి ఇంత పథకం పన్నారు. 
 • ఇంకా బుకాయిస్తే వారి ఖర్మ:
 • నిన్న వికాస్‌ ఖనేల్కర్‌ అనే వ్యక్తి ఎల్లో మీడియా చానళ్లలో ప్రత్యక్షమై అరగంట సుధీర్ఘ ఉపన్యాసం ఇచ్చాడు. 
 • బహుశా ఈడీ వాళ్లు నిజంగా తామే తప్పుగా పట్టుకున్నామా అన్నట్లుగా మాట్లాడారు. 
 • క్రిమినల్‌ కేసు, ఒక ఎక్యూజ్‌డ్, అరెస్ట్‌ అయిన వ్యక్తి..చార్జ్‌షీట్లో ఉన్నాడు.. అతన్ని తీసుకొచ్చి ప్రెస్‌ మీట్‌ పెట్టించి తమ పేపర్లలో పరిచేశారు. 
 • చంద్రబాబు తయారు చేసిన ఈ కాలసర్పాల్లాంటి వీరంతా సమాజానికి పట్టిన చీడలాంటి వారు. 
 • ముఖ్యంగా మీడియాలో ఉన్న వారు మమ్మల్నేం చేస్తారులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. 
 • కేంద్ర సంస్థలు  కూడా తప్పుపట్టి అరెస్ట్‌ చేసినా ఈ పచ్చ మీడియా మాత్రం పట్టించుకోవడం లేదు. 
 • మొన్న విచారణకు పెద్దగా అధికారులకు టైం దొరికినట్లు లేదు. అందుకే పూర్తిగా విచారించాలని కోరుతున్నారు. 
 • బహుశా విచారణ సందర్భంలో కూడా దబాయించి ఉండొచ్చు. 
 • జరిగింది ఘోరమైన నేరం.. పూర్తి ఆధారాలు తెచ్చి చూపిస్తున్నా ఇంకా భ్రమల్లో ఉండి నేల మీదకు దిగకపోతే వారి ఖర్మ. 
 • అగ్రిమెంట్‌ జరిగినట్లు మాకు తెలియనే తెలియదని సీమెన్స్‌ అంటోంది. ఆ డబ్బు మాకు రాలేదు అని కూడా చెప్తోంది. 
 • షెల్‌ కంపెనీల ద్వారా బయటకు వెళ్లిన ఆధారాలు కూడా ఉన్నాయి. 
 • ఇక నేను 2 లక్షల మందికి ట్రై నింగ్‌ ఇచ్చానంటే ఎలా..? అసలు ట్రై నింగ్‌ ఇవ్వడానికి కావాల్సిన సరంజామా ఎక్కడి నుంచి వచ్చింది..? 
 • వీటన్నిటికీ ఒకటే సమాధానం..అది చంద్రబాబే. 
 • దీన్ని కక్ష సాధింపని చూపడానికి ఆయన, మందీమాగదం ఏమి చేయాలో అన్నీ చేస్తారు. 
 • దీంట్లో కూడా రాజకీయ మైలేజ్‌ కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. 
 • దానిలో భాగంగాన పవన్‌ కల్యాణ్‌ తో మిగతా వాళ్లంతా కలుస్తారు కూడా. 
 • ఇంకా ఎక్కువ దీనిపై రచ్చ చేసుకుంటే వారే అబాసు పాలవ్వడం ఖాయం. అన్ని ఆధారాలున్నాయి. 
 • అలా కాదు బుకాయించి, దబాయించి, బెదరగొట్టి ఏదో చేయాలనుకుంటే ఆ పప్పులు ఉడకవు.

తాజా వీడియోలు

Back to Top