ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

కుట్ర రాజకీయాలకు తెరతీసిన  చంద్రబాబు 

ఐదేళ్లలో భారీగా పెరిగిన చంద్రబాబు ఆస్తులు

చంద్రబాబు శిఖండి రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెబుతారు.

చంద్రబాబు వ్యక్తిత్వం పాతాళం కంటే అధ్వాన్నం 

ఐదేళ్లు చేతగాని దద్దమ్మ పాలన చేసి..వైయస్‌ జగన్‌పై దుష్ఫ్రచారమా..

వైయస్‌ జగన్‌ ప్రజల మనసులను గెలుచుకున్నారు

హైదరాబాద్‌: దేశంలోనే అత్యంత ధనికుడైనా రాజకీయ నేత చంద్రబాబు అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసురెడ్డి పద్మ అన్నారు. ఆమె వైయస్‌ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.చంద్రబాబు ఆస్తి సుమారు 2 వేల కోట్ల రూపాయలు ఉంటుందని ఎనిమిదేళ్ల క్రితమే తహల్కా పత్రిక పేర్కొందన్నారు. తన ఆస్తులపై విచారణకు సిద్ధమని చంద్రబాబు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.తన ఆస్తులు,అక్రమాల మీద విచారణ జరగకుండా సీబీఐ,ఈడీ రాష్ట్రంలోని రాకూడదని చంద్రబాబు ఫత్వాలు జారీ చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ ఐదేళ్లలో తన ఆస్తులకు సంబంధించి ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే 100 రెట్లు ఆస్తులను పెంచుకున్నాSరన్నారు.చేతికి వాచీ, వ్రేలికి ఉంగరం లేదని చెప్పుకునే  నిరుపేద చంద్రబాబు ఆస్తులు ఈ ఐదేళ్లలో  భారీగా ఎందుకు పెరిగాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.నేడు రాష్ట్రంలో కాల్వలో నీరు పారడంలేదు గాని,ఏ ప్రాజెక్టులు రావడంలేదు గాని, నిధులు,డబ్బులు,కమీషన్లు,అవినీతి మాత్రం వరదలై పారుతుందన్నారు. ప్రాజెక్టులు కట్టకుండానే  ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పేరిట కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు,కమీషన్లు దండుకుని చంద్రబాబు కుటుంబం ఆస్తులు పెంచుకుందని మండిపడ్డారు.

రాష్ట్ర వృద్ధి రెండింతలు కూడా దాటడంలేదన్నారు. చంద్రబాబు ఆస్తులు మాత్రం 500 రెట్లు పెరిగాయి. వాస్తవం ఇలా ఉంటే..వైయస్‌ జగన్‌ జీవితం తెరిచిన పుస్తకమన్నారు.ౖ వైయస్‌ జగన్‌ అఫిడవిట్‌పై చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని తప్పుబట్టారు.వైయస్‌ జగన్‌ను రాజకీయంగా దెబ్బ తీయలేక సోనియాగాంధీతో కలిసి  చంద్రబాబు కుమ్మక్కై పెట్టిన కుట్ర కేసులను వైయస్‌ జగన్‌ అఫిడవిట్‌లో చూపించారన్నారు.వైయస్‌ఆర్‌ బతికున్నంత వరుకూ వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై కేసులు లేవన్నారు.ఎప్పడయితే కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి వైయస్‌ఆర్‌సీపీ పెట్టారో అప్పుడు నుంచి వైయస్‌ జగన్‌పై కుట్ర రాజకీయాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

17 కేసుల్లో స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు నేడు వైయస్‌ జగన్‌పై అవ్వాకులు,చవ్వాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.17 కేసుల్లో స్టేలు ఎందుకు తెచ్చుకున్నావో చెప్పగలవా అని చంద్రబాబును ప్రశ్నించారు.ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొని ప్రజల ముందుకు రావాగలవా అని ప్రశ్నించారు.కేసులపై విచారణ చేయించుకోవడానికి ఛాలెంజ్‌ చేయగలవా అని ప్రశ్నించారు.వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వస్తే మరణవాగ్మూలం రాసుకున్నట్లేనని చంద్రబాబు దుష్ఫ్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.ప్రజల మనసులను గెలుచుకున్న వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలన్నారు.ఈ ఐదేళ్లు చేతగాని దద్దమ్మ పాలన చేసి..నేడు వైయస్‌ జగన్‌పై బురదచల్లడం దారుణమన్నారు.

తొమ్మిదేళ్లగా కాంగ్రెస్,టీడీపీ, బీజేపీల కుట్రలతోనూ వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారని,ఏ రోజైనా ఒక చిన్న సంఘటన కూడా ఈ రాష్ట్రంలో జరిగిందా అని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎంత రెచ్చగొట్టిన,ఎన్ని కుట్రలు పన్నిన శాంతియుతంగానే పార్టీని నడిపిస్తున్నారన్నారు.చివరికి వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం కూడా చేశారని, ఆయన చినాన్న వైయస్‌ వివేకానందరెడ్డి కేసులో నిందితులను కాపాడుతున్నారని  ధ్వజమెత్తారు.చంద్రబాబు  హయాంలో ఎంతమంది ఆడపడుచుల పసుపు–కుంకమలు చెరిగిపోయాయో తెలియదా అని ప్రశ్నించారు.చేతగాని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిరూపించుకున్నారన్నారు.కుట్రలు పన్నితే తప్ప తన పీఠాన్ని కాపాడుకోలేని అసమర్థ సీఎం చంద్రబాబు అని దుయ్యబట్టారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తొమ్మిదేళ్లుగా సూటిగా, విలువలు గలిగిన రాజకీయాలు చేశారన్నారు.పార్టీలోకి ఎవరూ వచ్చిన సరే తమ పార్టీలకు రాజీనామాలు చేశాకే వైయస్‌ఆర్‌సీపీలోకి ఆహ్వానించారని తెలిపారు.చంద్రబాబులాగా కుట్ర రాజకీయాలు చేయడం వైయస్‌ జగన్‌కు తెలియవన్నారు. ప్రజలు మనసులు గెలిచుకుని,ప్రజల జీవితాలు మార్చాలనే నిరంతరం కష్టపడుతున్నారని తెలిపారు.వైయస్‌ జగన్‌ వ్యక్తితం హిమాలయలంతా ఉన్నతమైనందని,చంద్రబాబు వ్యక్తిత్వం పాతాళం కంటే అధ్వాన్నం అని అన్నారు.తొమ్మిదేళ్ల వైయస్‌ఆర్‌సీపీ ప్రయాణంలో ప్రజల విశ్వాసాన్ని పొందగలిగామని తెలిపారు.చంద్రబాబులాగా కుట్ర,హత్య రాజకీయాలు చేయలేదన్నారు.ప్రజలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు.అరాచకం సృష్టిస్తున్నారు.ఎన్నికల కోడ్‌ను కూడా బేఖాతర్‌ చేస్తున్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఓటమి భయంతో చంద్రబాబు,ఆయన తాబేదారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేస్తున్నా వైయస్‌ జగన్‌ సంయమనంతో ఉన్నారన్నారు.ప్రజల పట్ల వైయస్‌ జగన్‌ బాధ్యతగా మెలుగుతున్నారన్నారు.కుళ్లు,కుట్ర రాజకీయాలను ప్రజలు తిప్పికొడతారని తెలిపారు.చంద్రబాబు శిఖండి రాజకీయాలు చేస్తున్నారని,అలాంటి వారు చరిత్రలో పతనమయ్యారన్నారు.చంద్రబాబు కుట్ర రాజకీయాలు ప్రజలు నమ్మరని,ఖచ్చితంగా ఎన్నికల్లో బుద్ధి చెబుతారన్నారు.  

Back to Top