ప్రత్యేక హోదా పోరు.. పసుపు కుంకుమ.. పెన్షన్‌ పెంపు అన్నీ కుట్రే

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌బాబు

2017 గుంటురులో జరిగిన ప్లీనరీలో వైయస్‌ జగన్‌ నవరత్నాలు ప్రకటించారు

ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని చంద్రబాబు కుప్పిగంతుల రాజకీయం

బీజేïపీతో అంటకాగినప్పుడు హోదాపై ఎందుకు పోరాడలేదు?

హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ పోరాడుతుంటే చంద్రబాబు చోద్యం చూశారు

మోదీకి వ్యతిరేకంగా వైయస్‌ జగన్‌ పోరాడారు

పసుపు–కుంకుమకు ఎన్నికల షెడ్యూల్‌ అడ్డురాదా? 

మహిళలకు రెండో విడత డబ్బులు ఇచ్చేందుకు అవకాశం ఉందా? 

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బాబు కుట్రలు బయటపడుతున్నాయి

విజయవాడ: చంద్రబాబు మోసపూరిత పాలనపై వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌బాబు నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా పోరు, పసుపు కుంకుమ, పెన్షన్‌ పెంపు అన్నీ కుట్రేనని మండిపడ్డారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగినప్పుడు ఆయనకు హోదా గుర్తుకు రాలేదని ధ్వజమెత్తారు. వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టారని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పింఛన్ల పెంపు, పసుపు–కుంకుమ అంటూ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. గురువారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సారధ్యంలో మొదటి నుంచి పోరాటం చేస్తున్నామన్నారు. చివరి అస్త్రంగా ఎంపీ పదవులకు రాజీనామా చేయించి ఢిల్లీ వేదికగా ఆమరణ నిరాహార దీక్ష చేశామన్నారు. నలభై ఏళ్ల అనుభవం ఉందని నిత్యం ప్రచారం చేసుకునే చంద్రబాబు ఆ పని చేయలేకపోయారన్నారు.

 2017వ సంవత్సరం గుంటూరులో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో మా నాయకులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నవరత్నాల పథకాలను అధికారికంగా ప్రకటించారన్నారు. మేం అధికారంలోకి వస్తే ఆయా వర్గాలకు మేం చేసే సంక్షేమ కార్యక్రమాల వివరాలను సవిరంగా తెలిపారన్నారు. ఈ పథకాలపై రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి, ముఖ్యంగా చంద్రబాబు చేతుల్లో నుంచి మోసపోయిన యువకులు, మహిళలకు ఈ పథకాల్లో వెలుగులు చూశారన్నారన్నారు. ఇలాంటి క్రమంలో మరో రెండు నెలల కాలంలో ఎన్నికల షెడ్యూలు రానున్న క్రమంలో నలభై ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు కుప్పిగంతులు, దగా కోరు రాజకీయాలు చేస్తున్నారన్నారు. 

ఆడపడుచులకు పసుపు–కుంకుమ పథకం పేరుతో రూ.10 వేలు ఇస్తామని, పింఛన్లు రూ.2 వేలకు పెంచుతూ ఢాంబికాల ద్వారా చంద్రబాబు నిజస్వరూపాన్ని ఈ రోజు బట్టబయలు చేస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా సాధనలో వైయస్‌ జగన్‌ చూపించిన అచంచలమైన ఆత్మవిశ్వాసం, పోరాట పటిమ అజరామమన్నారు. రాజకీయాల్లో ప్రతికూలమైన సమయంలో చంద్రబాబు బీజేపీతో ఊరేగుతున్న సమయంలో, ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి ప్యాకేజీని ముద్దుపెట్టుకున్న రోజుల్లో వైయస్‌ జగన్‌ విద్యార్థులను కూడగట్టి యువభేరిలు నిర్వహించారన్నారు. రాష్ట్ర బంద్‌లకు పిలుపునిచ్చారన్నారు. దీక్షలు చేశారని తెలిపారు. ఢీల్లిలో ఉన్న ఎంపీలతో రాజీనామా చేయించారన్నారు. మోదీకి ఎదురొడ్డి మొట్టమొదటిసారిగా అవిశ్వాస తీర్మానం పెట్టిన మొనగాడు వైయస్‌ జగన్‌ అన్నారు. మడమ తిప్పకుండా ఏపీ ప్రజల కోసం వైయస్‌ఆర్‌సీపీ వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పోరాటం చేసిందన్నారు. 

డ్వాక్రా మహిళలకు ఇస్తామన్న రూ.10 వేల విషయంలో ప్రశ్నిస్తున్నామన్నారు. జీవో నంబర్‌ 17 జనవరి 21వ తేదీ మూలధనం నిధి కింద రూ.10 వేలు ఇస్తామని అందులో పేర్కొన్నారన్నారు. చంద్రబాబు ప్రకటన చూసి ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మరో రెండు నెలల కాలంలో ఎన్నికలు ఉండగా తొలి విడతగా రూ.2500 ఎందుకు ఇస్తున్నారని, మిగతావి మరో రెండు విడతల్లో ఇస్తామని ఏ ఉద్దేశంతో చెబుతున్నారని ప్రశ్నించారు. ప్రతి మాట అబద్దమే అన్నారు. ఆడపడుచులు రోడ్డుపైకి వచ్చారన్నారు. డ్వాక్రా రుణాలు మాఫి చేస్తామని మాట ఇచ్చి తప్పింది వాస్తవం కాదా అని నిలదీశారు. ఇవాళ మహిళలను మభ్యపెట్టేందుకు పసుపుకుంకుమ ప్రకటించారన్నారు. డ్వాక్రా రుణాలు సంపూర్ణంగా మేం చెల్లిస్తామని వైయస్‌ఆర్‌సీపీ చెప్పిందన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైయస్‌ జగన్‌ ప్రకటన చేసిన వెంటనే ఆ పని చేయాల్సి ఉండేదన్నారు.

తొలి విడత రూ.2500 ఫిబ్రవరి ఇస్తే, రెండో విడత ఇచ్చేసరికి ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందన్నారు. కాబట్టి అది ఇవ్వలేరన్నారు. మూడో విడత వచ్చేసరికి ఎన్నికలు వస్తాయన్నారు. నాకు ఓట్లు వేస్తేనే రెండు, మూడు విడతలు ఇస్తామని చెబుతారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయంలో మహిళలను లక్షాధికారులను చేసేందుకు పెద్ద మనసుతో సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చారన్నారు. చంద్రబాబు రాజకీయ కుట్ర, అధికార వాంఛతో ఈ పథకాన్ని చిందరవందర చేశారన్నారు. మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫి చేసి ఉంటే ఆర్థిక స్వావలంభన జరిగేందన్నారు. ఆంధ్రప్రభుత్వం సెర్ఫ్‌కు ఇచ్చిన మార్గదర్శకాలను ప్రజలే పరిశీలించాలన్నారు. సాక్షి పత్రికలో ఈ మోసాన్ని వివరించారని టీడీపీ గుండాలు ఆ పత్రిక ప్రతులను తగులబెట్టారన్నారు.

చంద్రబాబు గత ఎన్నికల సమయంలో 650 హామీలు ఇచ్చారన్నారు. వీటిలో ఒక్కటైనా సంపూర్ణంగా నెరవేర్చారా అని ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందని ఆ నాడు చెప్పారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు..దగా చేశారని మండిపడ్డారు. కుయుక్తు, డొంక తిరుగుడు రాజకీయాలు చంద్రబాబు అలవాటే అన్నారు. చంద్రబాబు ప్రకటించిన ఒక్క పథకమైనా ఉందా అని సవాలు విసిరారు. ప్రతి ఒక్క పథకం వైయస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకమే అన్నారు. అమరావతి భ్రమరావతిగా మార్చారన్నారు. ప్రజలను మోసం చేశారని, మనోభావాలను దారుణంగా దెబ్బతీశారన్నారు. రాష్ట్ర విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకుంటారని మీకు అధికారం ఇస్తే మోసం చేస్తారా అని మండిపడ్డారు. చంద్రబాబు నవరత్నాల నుంచి కాపీ కొడుతున్నారని ధ్వజమెత్తారు. దొంగ మాటలు,అబద్దపు మాటలతో ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు మాస్టర్‌ డిగ్రీ చేశారని విమర్శించారు. వెన్నుపోట్లు పొడిచి కూడా ఇదే రాజసం అని చెప్పే సమర్ధుడు చంద్రబాబు అన్నారు. 

పైప్‌లైన్‌ ద్వారా గాలి వస్తుందని, అమరావతి ప్రజలకు ఏసీ గాలి పైపుల ద్వారా అందిస్తామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆకాశహార్యాలు కడుతానని డాంబీకాలు పలికిన చంద్రబాబు ఇంతవరకు ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. బహుబలిని రాజమౌలి తీస్తే..చంద్రబలిని చంద్రబాబు దర్శకత్వంలో టీడీపీ నాయకులు తీస్తున్నారని ఎద్దేవా చేశారు. అందులో అనేకమైన కామిడీ యాక్టర్లు, విలన్లు ఉన్నారన్నారు. ఎందుకు చేతకాని మాటలని ఫైర్‌ అయ్యారు. బాబు కట్టిన తాత్కాలిక సచివాలయం ప్రాంతంలో మురుగునీరు పారుతోందన్నారు. రాజధాని పేరుతో 50 వేల ఎకరాలు దోచుకున్న దొంగ చంద్రబాబు అని విమర్శించారు. ఇకనైనా చంద్రబాబు మేల్కోని మంచి పనులు చేయాలని హితవు పలికారు. వినేవాడు వె్రరివాడైతే..చెప్పేవాడు చంద్రబాబు అన్న సామెత లాగా చేయొద్దని సూచించారు.

రాజధాని నిర్మాణం చేసేశానని బస్సులు పెట్టి జనాన్ని తరలిస్తున్నారని, అది చూసి కూడా ప్రజలు ఆహా..ఓహో అనాలా అని ప్రశ్నించారు. డబ్బులు లేకే డ్వాక్రా రుణాలు మాఫి చేయలేదని చంద్రబాబు అంటే నిజమే అని జనం నమ్మాలా అన్నారు. ఈ రోజు రూ.10 వేలు  ఇస్తున్నారంటే ఆహా..ఓహో అనాలా అని దుయ్యబట్టారు. తన వైఫల్యాలను, చేతకానితనాన్ని, దొంగ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి సీఎం ఉండటం ఏపీ ప్రజల దౌర్భాగ్యమన్నారు. చంద్రబాబు పాలనలో ఏపీ ప్రజలకు ఒరిగింది ఏమిటని ప్రశ్నించారు.

ప్రతి తలపై లక్షల రూపాయల అప్పును రుద్దారని, ఓవర్‌ డ్రాప్ట్‌కు చంద్రబాబు వెళ్లారన్నారు. వైయస్‌ఆర్‌ పాలనలో ఓవర్‌ డ్రాప్ట్‌ అన్న మాటే లేదన్నారు. రూ.2500 కోట్లు ఈ రోజు రాష్ట్రం ఓవర్‌ డ్రాప్ట్‌కు వెళ్లిందన్నారు. ప్రజలు అన్నివిషయాలపై ఆలోచించాలన్నారు. ఈ రోజు వరకు దుర్గా గుడి వద్ద ప్లైఓవర్‌ నిర్మాణం పూర్తి కాలేదన్నారు. బెంజీ సర్కిల్‌ వద్ద ప్లై ఓవర్‌ పూర్తి కాలేదన్నారు. ఏం జరుగుతుందో ప్రజలు గమనించడం లేదనుకుంటున్నారేమో? అందరూ మీ మీసాలను చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
 

Back to Top