వైయ‌స్ఆర్‌, వైయ‌స్ జ‌గ‌న్‌..ఇద్ద‌రిదీ ఒకే విజ‌న్‌

వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు వైవీ  సుబ్బారెడ్డి

తూర్పు గోదావ‌రి: అభివృద్ధి, సంక్షేమం ప‌ట్ల‌ దివంగ‌త మ‌హానేత‌ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలది  ఒకే ర‌క‌మైన విజ‌న్ అని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు,  టీటీడీ పూర్వ‌పు చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తూర్పు గోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాజమండ్రి  జీజీహెచ్ సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి  వై యస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైవీ  సుబ్బారెడ్డి పూల‌మాల వేసి నివాళులర్పించారు. అలాగే అన్న‌వ‌రం సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో భక్తుల సౌకర్యార్థం పెద్దాపురం లలితా రైస్ ఇండస్ట్రీ వారు నిర్మించిన కళ్యాణమండపం, ప్రసాదం తయారి కేంద్రాన్ని వైవీ  సుబ్బారెడ్డి దంపతులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వైవీ  సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2 లక్షల 60 వేల కోట్లు అప్పులు చేసి వెళ్లిందని మండిపడ్డారు. పాలన గాడిన పడేలోపే కరోనా సంక్షోభం వచ్చిందని,  అయినా స‌రే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంక్షేమ పాలన అందిస్తున్నామని తెలిపారు. అన్ని ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ధి చేస్తున్నార‌ని చెప్పారు.  రైతుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంద‌ని, గ‌తంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మేలు చేస్తోంద‌న్నారు.  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కృషితోనే కృష్ణా జ‌లాల విష‌యంలో కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్ ఇచ్చింద‌న్నారు.   
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top