మా కుటుంబంపై సీఎం వైయస్‌ జగన్‌ చూపిన అభిమానానికి కృతజ్ఞతలు

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి

 నెల్లూరు:  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తమ కుటుంబంపై చూపిన అభిమానానికి వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరులో సోమవారం ఏర్పాటు చేసిన మేకపాటి గౌతంరెడ్డి సంతాప సభలో రాజమోహన్‌రెడ్డి భావద్వేకంతో ప్రసంగించారు. ఈ విషాద ఘటన నుంచి నేటి వరకు సీఎం వైయస్‌ జగన్, ఆయన కుటుంబ సభ్యులు మా కుటుంబం పట్ల చూపించిన శ్రద్ధాశక్తులు ఎన్నటికీ మరవలేం. సీఎం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆసుపత్రికి వచ్చారు. హైదరాబాద్‌లోని ఇంటికి వచ్చారు. ఉదయగిరిలో అంత్యక్రియలకు వచ్చారు. తిరిగి ఇవాళ నెల్లూరు సంతాప సభకు వచ్చారు. వారికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఉదయగిరికి వచ్చిన సమయంలో సీఎం వైయస్‌ జగన్‌కు విన్నవించిన అన్ని అంశాలను కూడా అసెంబ్లీలో ఆమోదింపజేసి 7వ తేదీ క్యాబినెట్‌లో తీర్మానం చేయనున్నామని కొద్దిసేపటి క్రితమే సీఎం తెలిపారు.  వెలుగోండ ప్రాజెక్టు, హైలెవెల్‌ కెనాల్, ఉదయగిరి  మెరిట్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజీని అగ్రికల్చర్, హార్టికల్చర్‌ కాలేజీ చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఈ కాలేజీని అగ్రికల్చర్‌ యూనివర్సిటీ చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ను కోరుతున్నాను. యూనివర్సిటీగా మార్చితే మెట్టప్రాంతాలైన ప్రకాశం, నెల్లూరు, వైయస్‌ఆర్‌ జిల్లా, కర్నూలుకు ఉదయగిరి కూడలిగా మారుతుంది. మెట్ట ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. వెలుగొండ ప్రాజెక్టును వైయస్‌ రాజశేఖరరెడ్డి 2004లో సీఎం అయినప్పుడు నేను నరసరావుపేట ఎంపీగా ఉన్నాను. వైయస్‌ఆర్‌ పునాది రాయి వేసి మొదలుపెట్టారు. మార్కాపురం వెళ్లినప్పుడు వామపక్షాల నేతలు వెలుగొండ ప్రాజెక్టుకు పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. నిజంగా వెలుగొండ ప్రాజెక్టు క్షమపీడిత ప్రాంతాలకు నీటివసతి కల్పించే ప్రాజెక్టు. ఆ మహానేత అసాధ్యమైన ప్రాజెక్టుకు పునాది వేసి ప్రారంభించారు. ఆయన కుమారుడు వైయస్‌ జగన్‌ ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతున్నాను. అలాగే ఉదయగిరి ప్రాంతంలో చాలా మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలకు నీరివ్వాలంటే సోమశీల ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీలను ఎత్తిపోతల ద్వారా ఇవ్వవచ్చు అని ఆ రోజు వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆ రోజుల్లోనే చెప్పారు. వైయస్‌ జగన్‌ తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తానని మాటిచ్చారు. ఉదయగిరి ప్రాంతంలోని ప్రభుత్వ కాలేజీని నాడు–నేడు కార్యక్రమంద్వారా అభివృద్ధి చేస్తామని చెప్పారు.  మేం ఎవరూ అడగకుండా సంగం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి దానికి గౌతంరెడ్డి పేరు పెడతామని చెప్పారు. నిజంగా వైయస్‌ జగన్‌కు మాకుటుంబం కృతజ్ఞతగా ఉంటాం. గౌతంరెడ్డికి తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఆయన ప్రతిభాపాటవాలను, శక్తిసామర్ధ్యాలను నిజాయితీని నిరూపించుకునేందుకు అవకాశం కల్పించినందుకు  వైయస్‌ జగన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. విషాదం జరిగినప్పటి నుంచి మా కుటుంబం పట్ల చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గొప్పగా రాష్ట్రాన్ని పాలించాలని, నిజంగా రాష్ట్ర ప్రజలు ఇంకా గొప్పగా వైయస్‌ జగన్‌ను దీవిస్తారని ఆకాంక్షించారు. 

 

Back to Top