జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో హోంమంత్రి అనిత దోషి

జాయింట్ సెక్రటరీ నిరాకరించినా పెరోల్ కోసం పట్టుబట్టిన అనిత

టీడీపీ ఎమ్మెల్యేల పెరోల్ రికమండేషన్ల వెనుక దురాలోచనలు

ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున చేతులు మారిన డబ్బు

చిత్తశుద్ది వుంటే హోమంత్రి, టీడీపీ ఎమ్మెల్యేలపై సీఎం చర్య తీసుకోవాలి

వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు డిమాండ్

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు.

జీవిత ఖైదీ శ్రీకాంత్‌ అరాచకాలకు టీడీపీ అండ..

గత టీడీపీ ప్రభుత్వంలో నాలుగేళ్ళు జైలు నుంచి పరారీలో ఉన్న శ్రీకాంత్..

టీడీపీ ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో బయట అరాచకాలు..

మళ్ళీ శ్రీకాంత్‌ను రప్పించి దుర్మార్గాలకు పాల్పడాలన్నదే టీడీపీ నేతల లక్ష్యం..

వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ఆగ్రహం.

తాడేపల్లి:  జీవితఖైదీ శ్రీకాంత్‌ పెరోల్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన హోంమంత్రి వంగలపూడి అనిత, పెరోల్‌కు సిఫారస్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలపై తక్షణం చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు డిమాండ్ చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.... గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2014-18 వరకు నాలుగేళ్ళ పాటు శ్రీకాంత్ జైలు నుంచి పరారై, టీడీపీ నేతల అండతో స్వేచ్చగా వారి అవసరాల కోసం అనేక అరాచకాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. తిరిగి మరోసారి శ్రీకాంత్‌ను పెరోల్‌ పై బయటకు తీసుకువచ్చి, తమ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పావుగా వాడుకోవాలనే లక్ష్యంతోనే టీడీపీ ఎమ్మెల్యేలు, హోమంత్రి అనిత అతని పెరోల్‌ కోసం గట్టిగా ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బు కూడా చేతులు మారిందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...

జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ విషయం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ అక్రమ పెరోలో వెనుక టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు హోంశాఖ మంత్రి అనిత అధికార దుర్వినియోగంకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారింది. గతంలో జాయింట్ సెక్రటరీగా ఉన్న కిషోర్‌ కుమార్ ఈ పెరోల్ ఇవ్వడానికి సాధ్యం కాదు అని చెప్పినప్పటికీ హోమంత్రి అనిత, నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కుమ్మక్కై శ్రీకాంత్ పెరోల్‌ను చేయించారు. ఈ వ్యవహారం వెలుగుచూడటంతో గతంలో శ్రీకాంత్ చేసిన అరాచకాలు కూడా బయటకు వస్తున్నాయి. శ్రీకాంత్‌ను పెంచి పోషించింది తెలుగుదేశం పార్టీ. శ్రీకాంత్‌ అన్న సోదరుడు మునికృష్ణ, ఆయన ప్రియురాలు అరుణ కూడా 'మేం తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులం' అని స్వయంగా ప్రకటించుకున్నారు. శ్రీకాంత్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ పెరోల్‌ మీద బయటకు తీసుకురావాలని టీడీపీ ఎమ్మెల్యేలు స్వయంగా హోం సెక్రటరీకి లేఖలు ఇచ్చారు. ఆయన వాటిని జాయింట్ సెక్రటరీకి పంపితే, అక్కడి నుంచి చిత్తూరు జిల్లా ఎస్పీకి, జైలు సూపరింటెండెంట్‌కు రిపోర్ట్ ఇవ్వాలని రాశారు. ఈ అధికారులు శ్రీకాంత్ క్రిమినల్ స్వభావం, ఆయన బైటికి రావడం మంచిది కాదని జాయింట్ సెక్రటరీకి నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా శ్రీకాంత్ పెరోల్ ఫైల్‌పై ఇవ్వడానికి వీలులేదంటూ జూలై 16న జాయింట్ సెక్రటరీ కిషోర్ కుమార్ తన రిపోర్ట్‌లో పెరోల్‌ను నిరాకరించారు. ఆ తరువాత ఇదే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హోంమంత్రి వంగలపూడి అనితను కలిసి ఆమె ద్వారా ఫైల్‌పై సర్క్యులేట్ అంటూ రాసిన సిఫారస్‌లతో జూలై 30న జీఓ జారీ చేశారు. దీని వెనుక వీరి ఆసక్తి ఏమిటీ? శ్రీకాంత్‌కు పెరోల్‌ ఇచ్చి బయటకు రప్పించడంలో వారికి ఉన్న ఆసక్తి ఏమిటనే దానిపైవిచారణ జరపాలి. 

అరుణ నోరు విప్పకూడదనే అరెస్ట్ చేశారా..?

ఇదే శ్రీకాంత్ హత్యానేరంపై జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. 2014-18 వరకు జైలు నుంచి పరారై, సమాజంలో పలు అరాచకాలకు పాల్పడ్డారు. 2018 నవంబర్ నెలలో ఆయన స్వయంగా పోలీసుల ముందు లొంగిపోయాడు. తెలుగుదేశం ప్రభుత్వం లోని నాలుగు సంవత్సరాల పాటు జైలు నుంచి పరారైన ఖైదీగా అనేక అక్రమాలకు పాల్పడ్డారు. అతడిని పట్టుకోవడానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నించలేదు. టీడీపీ పెద్దలకు అవసరమైన పనులను అక్రమంగా చేసేందుకు శ్రీకాంత్‌ను వాడుకున్నారు. త్వరలో ఎన్నికలు వస్తున్నాయని తెలిసి, ప్రభుత్వ మారి వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే తనకు ఇబ్బంది అవుతుందని అతడే స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతడిని పెరోల్‌ మీద బయటకు తీసుకురావడానికి టీడీపీ ఎమ్మెల్యేలు మరోసారి తీవ్రంగా ప్రయత్నించారు. తాము చేయాలనుకున్న అక్రమాలను తమ చేతికి మట్టి అంటకుండా శ్రీకాంత్ వంటి ఖైదీలను అడ్డం పెట్టుకుని చేయించుకునేందుకే పెరోల్‌ కోసం పట్టుబట్టారు. ఈ వ్యవహారంలో డబ్బు కూడా చేతులు మారడంతో మరింత ఉత్సాహంగా టీడీపీ ఎమ్మెల్యేలు, హోమంత్రి అనిత పనిచేశారా? పెరోల్ వ్యవహారం మీడియా ద్వారా బయటకు రావడం, టీడీపీ ఎమ్మెల్యేలు, హోంమంత్రి అనితల వ్యవహారంపై పలు సందేహాలు తలెత్తడంతో వాటిని కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ వ్యవహారంలో శ్రీకాంత్ ప్రియురాలు అరుణను కూడా అందుకే హడావుడిగా అరెస్ట్ చేసి ఆమె నోరు మూయించేందుకు తెగబడ్డారు. తన అరెస్ట్‌కు ముందే అరుణ సోషల్ మీడియా ద్వారా తాను నోరు విప్పితే చాలా మంది పెద్దల బాగోతాలు బయటపడతాయంటూ హెచ్చరికలు చేసిన విషయం వాస్తవం కాదా? వెంటనే అరుణపై పాత కేసులను తిరగదోడి ఆమెను అరెస్ట్ చేశారు. పైగా ఈ వ్యవహారాన్ని వైయస్ఆర్‌సీపీపైకి నెట్టేందుకు, బుదరచల్లేందుకు కూడా హోంమంత్రి అనిత సిద్దపడటం సిగ్గుచేటు. రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలు, అమరావతి ముంపు, వరదలను డైవర్ట్ చేసేందుకు శ్రీకాంత్ వ్యవహారాన్ని ముందు పెడుతున్నారు. ఈ వ్యవహారంపై శ్రీకాంత్ పెరోల్‌కు సిఫారస్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరిని హోమంత్రి అనితను మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ఆమె దాటవేశారు. అధికారులు నిరాకరించిన ఖైదీకి ఎలా పెరోల్ ఇవ్వమని రికమండ్ చేశారో చెప్పాలంటే హోంమంత్రి అనిత నీళ్ళు నమిలారు. ఈ విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా ఆమె తన పదవికి రాజీనామా చేయాలి. సీఎం చంద్రబాబు నిత్యం రాజకీయాలను ప్రక్షాళన చేయాలంటూ మాట్లాడుతుంటారు, ఇక పెరోల్ వ్యవహారంలో ప్రభుత్వానికి తలదింపులు తెచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు, హోమంత్రి అనితపై చర్యలు తీసుకోగలరా?

Back to Top