దళితుల కోసం హృదయంతో ఆలోచించే నేత సీఎం వైయస్‌ జగన్‌ 

వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు జూపూడి ప్రభాకర్‌రావు

ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ను ప్రభుత్వం పొడిగించడం శుభపరిణామం

సబ్‌ప్లాన్‌పై ఈనాడు పొట్ట రాక్షసుడు అసత్యాలు రాస్తున్నాడు 

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై రామోజీరావు చర్చకు వస్తారా? 

సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు రామోజీకి లేదు

చంద్రబాబు హయాంలో దళితులకు ఏం చేశారు?

వైయస్‌ జగన్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక రాక్షస రాతలు  

ఎస్సీ సబ్‌ప్లాన్‌పై కేంద్ర గణాంకాల్లో ఏపీకి అగ్ర స్థానం

తాడేపల్లి: దళితుల కోసం హృదయంతో ఆలోచించే నేత సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు జూపూడి ప్రభాకర్‌రావు కొనియాడారు. ఎవరూ అడగకుండానే ఎస్సీ,ఎస్టీ సబ్‌ ప్లాన్‌ను మరో పదేళ్ల పాటు కొనసాగిస్తూ అర్డినెన్స్‌ చేసిన గొప్ప మనసున్న ముఖ్యమంత్రి అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను పొడిగించడం శుభపరిణామమన్నారు. సబ్‌ప్లాన్‌పై ఈనాడు పొట్ట రాక్షసుడు అసత్యాలు రాస్తున్నారని మండిపడ్డారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు రామోజీరావుకు లేదని ధ్వజమెత్తారు.  ఎస్సీ సబ్‌ప్లాన్‌పై కేంద్ర గణాంకాల్లో ఏపీకి తొలి స్థానం వచ్చిందని గుర్తు చేశారు. సోమవారం వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జూపూడి ప్రభాకర్‌రావు మీడియాతో మాట్లాడారు.

 •  రాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు  జూపూడి ప్రభాకరరావు ఏమ‌న్నారంటే..
 • - బాబు హయాంలో దళితుల సంక్షేమానికి ప్లానూ లేదు.. సబ్ ప్లానూ లేదు
  - జగన్ గారి పరిపాలనలోనే ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత
  - కేంద్ర చట్టం కారణంగా బడ్జెట్ లో ప్లాన్, సబ్ ప్లాన్ అన్న పదాలు లేవు
  - కేటాయింపులు జరుగుతున్నది ఎస్సీ, ఎస్టీ కాంపొనెంట్ పేర్లతో మాత్రమే..
  - ఎస్సీ సబ్ ప్లాన్ పై చెత్త రాతలు రాస్తున్న ఈనాడును చెత్తలో పడేయండి
  - బొజ్జ రాక్షసుడు రామోజీ.. ఫిల్మ్ సిటీని వదిలి ఏపీగ్రామాలకు వచ్చి అభివృద్ధిని చూడాలి
  - తప్పుడు రాతలు రాయడం ఆపకపోతే.. ఈనాడును తగలబెట్టాల్సి వస్తుంది
  - దళితుల జీవనస్థితిగతులు ఎవరి హయాంలో ఎలా ఉన్నాయో రామోజీ ఏనాడైనా అధ్యయనం చేశాడా..?
  - టీడీపీ హయాంలో 5 ఏళ్ళలో ఎస్సీలకు చేసిన ఖర్చు రూ. 33, 625 కోట్లు
  - జగన్ గారు మూడున్నరేళ్ళలోనే చేసిన ఖర్చు రూ. 48,899 కోట్లు
  - దళితుల ఆత్మ బంధువు జగన్ గారు
  - ప్రజాస్వామ్యవాదులు గర్వపడేలా విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడుతున్నాం
  -ఃజూపూడి ప్రభాకరరావు

   సబ్ ప్లాన్ కు మించి దళితుల సంక్షేమానికి ఖర్చుః

  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారి నేతృత్వంలోని ఈ ప్రభుత్వం..  దళితుల సంక్షేమానికి, వారి అభ్యున్నతికి చేస్తున్న కృషిని దళితులంతా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. సబ్ ప్లాన్ కు మించి జగన్ మోహన్ రెడ్డిగారు దళితుల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రతి పథకంలోనూ ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, వారి జనాభా దామాషాకు మించి నిధులు ఖర్చు చేస్తుంది.  వాస్తవానికి, కేంద్రం చట్టం కారణంగా, నీతి ఆయోగ్‌ వచ్చిన తర్వాత బడ్జెట్ లో ప్లాన్‌, సబ్‌ ప్లాన్‌ అన్న పదాలు లేవు. కాంపొనెంట్‌ గానే దళితులకు నిధులు ఖర్చు చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో, దళితుల సంక్షేమానికి ఎటువంటి ప్రణాళిక లేదు. అయినా ఈనాడు రామోజీరావు  ఏనాడూ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క ముక్క రాయలేదు. ఇప్పుడేమో సబ్ ప్లాన్ చట్టం పేరుకే.. అంటూ బొజ్జ రాక్షసుడు ఈనాడు రామోజీ చెత్త రాతలు రాస్తున్నాడు. 

  తప్పుడు రాతల ఈనాడును చెత్తలో పడేయండిః
  దళితుల సంక్షేమం గురించి ఏనాడూ కనీసం అధ్యయనం చేయని, ఏ ప్రభుత్వ హయాంలో దళితులు అభివృద్ధి చెందారో, ఎప్పుడు వారికి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయో రాయలేని రామోజీ.. ఈరోజు ప్రభుత్వంపై చెత్త రాతలు రాస్తున్నాడు. చెత్త రాతలు రాస్తున్న ఈనాడు పత్రికను చెత్తలో పడేయమని చెబుతున్నాను. ఇవే తప్పుడు రాతలు రాస్తే.. ఈనాడు పత్రికను తగలబెట్టాల్సిన పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నాం.
  – ఎప్పుడూ టీడీపీ సామాజిక వర్గాన్ని పొగుడుతూ రాయడం, ఆ పార్టీ అధికారంలో లేకపోతే, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీపైనే విమర్శలు చేయడం రామోజీకి అలవాటుగా మారింది.  కాటికి కాళ్లు చాచే వయసులో కూడా హైదరాబాద్ ను, ఫిల్మ్ నగర్ ను వదిలిపెట్టి, సొంత ఊరికి కూడా రాకుండా, ఇక్కడి పరిస్థితులేమిటో తెలుసుకోకుండా దళితుల గురించి తప్పుడు వార్తలు రాస్తావా ? 
  – ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను మరో పదేళ్ళు పెంచుతూ ఆర్డినెన్సు ఇచ్చినందుకు మా జాతి అంతా ఆనందంగా ఉంటే..  ఈనాడు రామోజీ మాత్రం దళితులను అడ్డు పెట్టుకుని ప్రభుత్వంపై బురదజల్లుతున్నాడు. దళిత బాంధవుడు, మంచి మనసున్న వ్యక్తి కనుకే జగన్‌ గారు ఇంత గొప్ప సంక్షేమ పథకాలను రూపకల్పన చేసి, అమలు చేస్తున్నారు.  ఇదేదీ ఈ పచ్చ పత్రికకు కనిపించదు. గుండెలేని వాళ్లే ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తారు. ఏ రోజైనా దళితులకు జరిగిన మంచి గురించి టీడీపీ, పచ్చ పత్రికలు రాసిన సందర్భం ఉందా?

  ఎస్సీ సంక్షేమంలో ఏపీ ప్రథమస్థానం, మీకళ్ళకు కనిపించలేదా..?
  – 2014–15 నుంచి 2018–19 వరకు టీడీపీ ప్రభుత్వం దళితులకు రూ.  33,625 కోట్లు ఖర్చు చేస్తే... జగన్‌ గారు కేవలం  మూడున్నరేళ్లలో రూ. 48,899.66కోట్లు ఖర్చు చేశారు. ఇదీ జగన్‌ గారు దళితులకు చేసిన సంక్షేమం.  కళ్లుండీ కబోదులైన ఈ దుష్ట చతుష్టయం ఈ సంక్షేమాన్ని చూడలేరు.  ఈ బొజ్జ రాక్షసుడు, నరకాసురుడు రామోజీకి ఇది కనిపించదు.  తన సామాజిక వర్గం సంక్షేమం తప్ప ఇతర సామాజిక వర్గాలను గౌరవించని వ్యక్తిని ఇలా అనక తప్పడంలేదు. ఒక పక్క కేంద్రం- రాష్ట్రప్రభుత్వాన్ని ఎస్సీల సంక్షేమం విషయంలో ఎంతగానో ప్రశంసించింది. అనేక సంక్షేమ పథకాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముందుందని, ఎస్సీ సబ్‌ప్లాన్‌లో ప్రథమస్థానంలో ఉందని కేంద్రం కొనియాడింది. అది మీకు కనిపించదు. ఎస్సీ ఉప ప్రణాళిక కింద దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎంత ఖర్చు చేశారో..  ఒక్క మన రాష్ట్రంలోనే అంత ఖర్చు చేశారు. దాంతో ఇవాళ 29,10,944 ఎస్సీ కుటుంబాలు జగన్‌ గారి సంక్షేమ పథకాల వల్ల బాగుపడుతున్నాయి. పేదల కోసం ప్రధానంగా దళితుల కోసం చేసిన సంక్షేమం ఇది.
  - మరోవైపు దళితుల ఆత్మ బంధువులు వైఎస్ కుటుంబం. వైఎస్ కుటుంబం దళితులను వారి కుటుంబాల్లో భాగస్వాములను చేసుకున్నారు. 
  – డీబీటీ ద్వారా ప్రతి ఇంటికి గడపగడపకు ఎంత వచ్చిందో మేం ధైర్యంగా చెప్పగలం. ఈ రామోజీ, ఈ రాధాకృష్ణ ఏనాడైనా మా ప్రోగ్రెస్‌ రిపోర్టు గురించి రాశారా?. ఆ ధైర్యం మీకు లేదు. 
  - ఈ రోజు అన్ని కులాలను సమభావనతో చూస్తున్న జగన్‌ గారి వెన్నలాంటి మనసు మీ కెందుకు కనిపించడం లేదు? . స్పెషల్‌ కాంపొనెంట్‌ ద్వారా దళిత వర్గాలకు ఎంత వరకు రావాలో అంతకుమించి జగన్‌ గారు ఇచ్చారు. 
  –మీ పత్రికలు ఇలాంటి వక్రమైన రాతలు రాస్తుంటే మీ పత్రికను తగలబెడతాం. మీ సామాజిక న్యాయం.. మీ  పత్రిక, చిట్‌ఫండ్, పచ్చళ్ల కంపెనీల్లో ఉందా?
  – అమ్మ ఒడి,  చేయూత, ఆసరా.. తదితర ఎన్నో పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు చెందిన  లబ్ధిదారులు జగన్‌ గారిని ఎంతగానో ప్రశంసిస్తుంటే అవేవీ మీకు కనిపించడం లేదా?. ఇప్పుడు ఇస్తుంది కాంపొనెంట్‌ అని మీకు తెలియదా?
  - ఎస్సీలకు 25 శాతం మించి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చారని  మేము సగర్వంగా చెప్పగలం.
  - ఇంగ్లీష్‌ మీడియం మా ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు, పేదవాళ్ళు చదవడానికి వీల్లేదని దుర్మార్గమైన మోడరన్‌ అన్‌టచ్‌బిలిటీని తెచ్చింది మీరు కాదా..?
  -  వైద్య ఆరోగ్య శాఖలో  98.4 శాతం దళిత నర్సులు ఉద్యోగాలు పొందారు. టీడీపీ హయాంలో మా ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఎందరికి ఉద్యోగాలు ఇచ్చారు? 
   
  దోపిడీ పక్షాన రామోజీః
  - ఎక్కడైతే దోపిడీ ఉందో అక్కడ మీరుంటారు.  ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులను మళ్లించారని మీరు , మీపైన ప్రేమానురాగాలు ఒలకబోయాల్సిన పనిలేదు. మీరనుకునే పవన్‌ కల్యాణ్ కు గాని, దుష్టచతుష్టయానికి గానీ లేని గొప్ప ఆలోచనలు జగన్‌ గారికి ఉన్నాయని తెలసుకోవాలి. మీ ప్లాన్‌ లు అన్నీ.. దళితులకు చెందిన వేల ఎకరాలను ఎలా  కొట్టేయాలి... 
  రింగ్‌ రోడ్డుకు ఫిల్మ్‌సిటీని ఎలా దగ్గరగా చేయాలి? ఇలాంటివే మీ ఆలోచనలు.
  - పేద వర్గాలను మిగతా వర్గాలతో సమానంగా పైకి తీసుకురావడమే జగన్ గారి ఆలోచన. ఎస్సీఎస్టీ బీసీల తదితర అన్ని వర్గాల సంక్షేమానికే జగన్‌ గారు కట్టుబడ్డారు. 
  - రామోజీ వయసు 87-88 ఏళ్లు. నువ్వు తెచ్చిన మార్పేమిటో చెప్పు రామోజీ. 
  - రూ. 1,86,000 కోట్లు డీబీటీ ద్వారా జగన్‌ గారు మా కోసం ఖర్చు చేస్తే.. ఒక్క రోజు అయినా దీని  గురించి రాశావా రామోజీ?
  - గత ప్రభుత్వం ఏం చేసింది?  ఈ మూడేళ్లలో మా ప్రభుత్వం ఏం చేసిందో నువ్వుఏనాడైనా అధ్యయనం చేసి రాశావా?
  - ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టి, మనుషుల ప్రాణాలు తీసే టీడీపీని, బాబును సమర్థించడానికి సిగ్గు ఎక్కడ లేదు?
   
  ఎందుకు అంబేద్కర్ గారి పేరు రాయలేదు?
  - కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెడితే మీరు సృష్టించిన అలజడి ఎంత దారుణం.?. అంబేద్కర్‌ పేరు పెడితే ఓర్చుకోలేని మీరు..  మీ పత్రికలో కూడా కోనసీమ జిల్లా అని  మాత్రమే చాలాకాలం  రాసి, అంబేద్కర్‌ గారి పేరు రాయలేదు, ఎందుకు..?. ప్రజల్లో నిరసనలు వచ్చిన తర్వాత మాత్రమే ఇప్పుడు రాస్తున్నారు.
  - అలానే విజయవాడలోనే 125 అడుగుల అతి పెద్ద అంబేద్కర్‌ గారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం. దాంతోపాటు ఒక లైబ్రరీ, ఒక రీసెర్చ్ సెంటర్‌ రాబోతుంటే.. మీరు రాస్తున్నదేంటి?. అది వాకింగ్‌ ప్లేస్‌ అని దుర్మార్గంగా రాస్తున్నారు. మీ సామాజిక వర్గం తప్ప మిగతా వారంతా పోవాలని ఆలోచిస్తున్నారు.
  - దళితుల పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియంతో సహా, వారికి షూ, పుస్తకాలతో సహా సమస్తం జగన్‌ గారు సమకూరుస్తున్నారు. పాత బడులన్నీ నాడు- నేడు కార్యక్రమంలో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ బడులన్నీ కార్పొరేట్‌ బడులుగా మారుతున్నాయి. 
  ఇవన్నీ బాబు ఎప్పుడైనా చేశారా?. మీ హయాంలో పథకాలు జన్మభూమి కమిటీలు సూచించిన మీ వర్గానికే తప్ప ఇంకెవరికైనా సంక్షేమ ఫలాలు అందాయా? 
  - విదేశీ విద్య ద్వారా దళితుల్లో ఎవరికైనా అమెరికాలో సీటొస్తే ప్రభుత్వం 50 లక్షలు కట్టి, పంపిస్తోంది. దీన్ని కూడా కొందరు విమర్శిస్తున్నారు. కోటి రూపాయలైనా సరే విదేశాల్లో గుర్తింపు పొందిన  వంద కాలేజీల్లో  సీటొస్తే పంపిస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి?
  - జగన్‌ గారికి అండగా దళితులు ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదల పక్ష ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకుంటున్నాం.  దళితులు, బీసీలు, ఎస్టీలు జగన్‌ గారి పక్షానే ఉన్నారు. జగనన్న ఆలోచన వర్థిల్లాలి ... అని దళితులు నినదిస్తున్నారు.. అని జూపూడి ప్రభాకరరావు తెలిపారు 

Back to Top