సీతంరాజు సుధాక‌ర్‌ను అత్య‌ధిక మెజారిటీతో గెలిపించాలి

వైయ‌స్ఆర్‌సీపీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి
 

విశాఖ‌: వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ను అత్య‌ధిక మెజారిటీతో గెలిపించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ రీజిల‌న్ కో-ఆర్డినేట‌ర్‌, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. లెన్సమ్ ఆక్సిజన్ టవర్స్ లో సతీష్ వర్మ ఆధ్వర్యంలో లెన్సమ్ ఆక్సిజన్ టవర్స్ రెసిడెన్షియల్ ఓనర్స్ వెల్ఫేయిర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి విశాఖ,అనకాపల్లి,విజయనగరం జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్,టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి  ,ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్  ,జిల్లా పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు, ఇతర ప్రజా ప్రతినిధులు పెద్దలు తో కలిసి పాల్గొన్న విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కేకే రాజు  పాల్గొన్నారు. అలాగే దువ్వాడ లో దామా సుబ్బారావు ఆధ్వర్యం లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో కూడా వైవీ సుబ్బారెడ్డి పాల్గొని పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు. సుధాక‌ర్‌కు మొద‌టి ప్రాధాన్య‌త ఓటు వేయించాల‌ని సూచించారు.

Back to Top