మోక్ష నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలలో ఎంపీ అవినాష్‌

వైయ‌స్ఆర్ జిల్లా: కమలాపురం మండల పరిధిలోని రామాపురం గ్రామంలో నిర్వ‌హిస్తున్న మోక్ష నారాయణస్వామి బ్రహ్మోత్సవాల్లో కడ‌ప ఎంపీ వైయ‌స్‌ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా  ఆలయ ప్రధాన అర్చకులు ఘనాపాటి, ఆలయ చైర్మన్ సాయినాథ్ శర్మ ఎంపీకి పూర్ణకుంభంతో స్వాగతం ప‌లికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అవినాష్‌రెడ్డి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వేదపండితుల వేద ఆశీర్వాదాలతో అవినాష్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు.  నిత్య కల్యాణ మండపంలో ఆలయ విశిష్టతను ఎంపి కి ఆలయ చైర్మన్  సత్య సాయినాథ్ శర్మ, మణికంఠ శర్మ, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి వివ‌రించారు.

Back to Top