చంద్ర‌బాబు మోసాల‌ను ఇంటింటా ఎండ‌గ‌డుదాం

మాజీ ఎమ్మెల్యే వై. వెంక‌ట్రామిరెడ్డి

గుంత‌క‌ల్లులో `రీకాలింగ్ బాబూస్ మేనిఫెస్టో`పై స‌మావేశం

అనంత‌పురం:  చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏడాది కాలంలో చేసిన మోసాల‌ను ఇంటింటా ప‌ర్య‌టించి ఎండ‌గ‌డుదామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే వై.వెంక‌ట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం గుంత‌క‌ల్లు నియోజ‌క‌వ‌ర్గంలో రీకాలింగ్ చంద్ర‌బాబూస్ మేనిఫెస్టో కార్య‌క్ర‌మంపై పార్టీ శ్రేణుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా  `బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ` క్యూ ఆర్ కోడ్ పోస్ట‌ర్ ఆవిష్క‌రించారు.   స‌మావేశానికి ముఖ్య అతిథలుగా  వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర నాయకులు సతీష్ రెడ్డి, పార్లమెంటు పరిశీలకులు బి.నరేష్ కుమార్ రెడ్డి, శింగనమల సమన్వయకర్త డాక్టర్ శైలజ్ నాథ్, జిల్లా ఉపాధ్యక్షురాలు వై.నైరుతిరెడ్డి, గుంతకల్లు నియోజకవర్గ జడ్పీటీసీలు,  ఎంపీపీలు, పార్టీ మండల అధ్యక్షులు, జిల్లా పార్టీ కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి అనుబంధ విభాగాల యందు వివిధ హోదాలలో ఉన్నవారు పాల్గొన్నారు.

Back to Top