ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటాల‌కు సిద్ధం కావాలి 

వైయ‌స్ఆర్‌సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 

కర్నూలు:  ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పార్టీ శ్రేణులు పోరాటాల‌కు సిద్ధం కావాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం క‌ర్నూలులో పెద్దిరెడ్డి ప‌ర్య‌టించారు. పార్టీ నాయ‌కుల స‌మావేశంలోఆయన మాట్లాడారు.వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్న 46 శాతం ఓటింగ్ వచ్చిందని.. పార్టీ భయపడాల్సిన పరిస్థితి లేదు. అన్ని వర్గాలతో కలిసి ఐక్యంగా ముందుకెళ్లాలి. త్వరలోనే వైయ‌స్‌ జగన్‌ ప్రజల్లోకి వస్తారు. మీ సమస్యలను పార్టీ దృష్టికి తీసుకురావాలి. కూటమి ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసింది. వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అందించింది. రెండు సంవత్సరాల పాటు తూచ తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్న చెప్పిన మాట ప్రకారం అమలు చేశారు. కరోనా కాలంలో చంద్రబాబు, నారా లోకేష్ హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఏ ఎన్నికలు వచ్చినా కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని పెద్దిరెడ్డి చెప్పారు.

Back to Top