అరెస్టులు అప్రజాస్వామికం 

 మాజీ ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వాధికారి కృష్ణమోహన్‌రెడ్డి అరెస్టులను తీవ్రంగా ఖండించిన‌  వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

 తాడేప‌ల్లి: చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని.. మాజీ ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వాధికారి కృష్ణమోహన్‌రెడ్డి అరెస్టులను ఖండిస్తున్నామని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు కక్ష రాజకీయాల వల్ల వ్యవస్థలు దెబ్బతింటున్నాయన్నారు. తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలు సృష్టిస్తున్నారని.. ప్రభుత్వాధికారులను, మాజీ ప్రభుత్వాధికారులపై కూడా రాజకీయ విరోధం చూపిస్తున్నారంటూ బొత్స మండిపడ్డారు.

చంద్రబాబు తీసుకొచ్చిన తప్పుడు సంప్రదాయాలు రాష్ట్రానికి చేటు చేస్తాయి. లిక్కర్‌ వ్యవహారంలో ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు చూపడం లేదు. కాని.. బెదిరించి, భయపెట్టి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని, అరెస్టులు చేస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో మద్యం కల్తీ జరుగుతోందని ఆరోపించారు. మరి ఇప్పుడు అవే డిస్టలరీల నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో ఖజానా వల్ల నష్టం వచ్చిందన్నారు. మరి ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నా ఆదాయాలు ఎందుకు పెరగడంలేదు?’’ అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

కక్ష రాజకీయాలు తార స్థాయికి.. గడికోట శ్రీకాంత్‌రెడ్డి 
ఆంధ్రప్రదేశ్‌లో కక్ష రాజకీయాలు తార స్థాయికి చేరాయని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘ఐఏఎస్‌లను, ఐపీఎస్‌లను ఇప్పటికే టార్గెట్‌చేసి వారిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఇప్పుడు మాజీ ఐఏఎస్‌, మాజీ ప్రభుత్వాధికారులపైనా చంద్రబాబు కక్ష రాజకీయం చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్‌కు మంచివి కావు. చంద్రబాబు కక్ష రాజకీయాలు రాష్ట్రాన్ని, ప్రజలను దెబ్బతీస్తాయి.

..పరిపాలనలో చంద్రబాబు ఘోరంగా విఫలం కావడంవల్లే ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. వాగ్దానాల అమలు లేదు, ఏ వర్గంకూడా సంతోషంగా లేరు. రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రతలేదన్న సంకేతాన్ని చంద్రబాబు ఇస్తున్నారు. మాజీ ఐఏఎస్‌ ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. తప్పుడు రాజకీయాలు మాని, రాష్ట్రంపై చంద్రబాబు దృష్టిపెట్టాలి. అణచివేసినంత మాత్రాన ప్రభుత్వంపై వ్యతిరేకత సద్దుమణగదు’’ అని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.

అరెస్ట్‌ క్రూరమైన రాజకీయ కక్ష సాధింపు.. మేరుగ నాగార్జున
ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి అరెస్ట్‌ క్రూరమైన రాజకీయ కక్ష సాధింపు అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు చర్య అని.. ప్రతిపక్ష పార్టీపై ప్రతీకారం తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌ ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తోంది. ఈ అరెస్ట్‌లకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని మేరుగ నాగార్జున హెచ్చరించారు.

చంద్రబాబువి కక్ష రాజకీయాలు: మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు
మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్టమోహన్ రెడ్డిల అరెస్టును ఖండిస్తున్నాను. ఈ అరెస్టులు అప్రజాస్వామికం. ప్రజలకిచ్చిన హామీల అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. విపక్ష పార్టీ నేతలతో పాటు ప్రభుత్వాధికారులతో పాటు మాజీ అధికారులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహనరెడ్డిల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాను.

వైయ‌స్ఆర్‌సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం.. మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్‌
ధనుంజయ రెడ్డి, క్రిష్ణమోహన్‌ రెడ్డి అరెస్ట్‌ రాజకీయ కక్ష సాధింపు. వైయ‌స్ఆర్‌సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు. ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులు. ఇది ఇంకా కొనసాగితే ఏ మాత్రం సహించబోము. ప్రభుత్వ తీరును కచ్చితంగా ప్రజల్లో ఎండగడతాం. అక్రమ కేసుల్లో అరెస్టయిన వారికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుంది. తగిన న్యాయ సహాయం అందిస్తాం.

చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌  - రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

  • రెడ్‌ బుక్‌ రాజ్యాంగం పేరుతో వైయ‌స్ఆర్‌సీపీని టార్గెట్‌ చేశారు, మా పార్టీ నాయకులనే కాదు అధికారులను కూడా వేధించడం అత్యంత జుగుప్సాకరం
  • సూపర్‌ సిక్స్‌ పథకాల ఊసు లేదు కానీ మా పార్టీ వారిని వందల మందిని జైలు పాలు చేస్తున్నారు, ఇంత దారుణమైన పాలన ఎన్నడూ చూడలేదు
  • ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదు
  • కక్షసాధింపులు, వేధింపులు, దాడులు, దౌర్జన్యాలతో ఏడాది కాలం గడిపారు 
  • అధికారులపై వ్యక్తిగత కక్షలు, అరెస్ట్‌లు దారుణం
  • రేపుటి రోజు ఏపీలో ఏ ఒక్క ఐఏఎస్‌, ఐపీఎస్‌ పనిచేయరు
  • ప్రజలన్నీ గమనిస్తున్నారు, తగిన బుద్ది చెప్పే రోజు అతి త్వరలోనే ఉంది  

పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. తిరుపతి ఎంపీ గురుమూర్తి
చంద్రబాబువి కక్ష రాజకీయాలు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్టమోహన్ రెడ్డిల అరెస్టును ఖండిస్తున్నాను. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు చేస్తున్నారు. లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలు చూస్తున్నారు.

రెస్టు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట:మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌.

  •  జరగనిది జరిగినట్లు దుష్ప్రచారం చేస్తూ, ప్రతి అంశంలో గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని నిందించడమే లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పని చేస్తోంది.
  • కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట.. ఈరోజు మాజీ ఐఏఎస్‌ కె.ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్ణమోహన్‌రెడ్డి అరెస్ట్‌.
  • అసలు జరగని లిక్కర్‌ స్కామ్‌ జరిగిందని ఆరోపిస్తూ, ఎక్కడా, ఏ ఆధారాలు లేకపోయినా..తప్పుడు కేసులు పెడుతూ, అందులో అందరి పేర్లు చేరుస్తూ, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ, తప్పుడు వాంగ్మూలాలతో కూటమి ప్రభుత్వం లేని లిక్కర్‌ స్కామ్‌ కేసు దర్యాప్తు చేస్తోంది.
  • టార్గెట్‌గా పెట్టుకున్న వారిని అందులో చేర్చి, అరెస్టులు చేస్తోంది.
  • సీఎం చంద్రబాబు చేస్తున్న ఈ అనైతిక పని, మొత్తం వ్యవస్థలపైనే ప్రభావం చూపుతుంది.
  • మంత్రి నారా లోకేష్‌ పదే పదే చెబుతున్నట్లుగా, రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం కొనసాగుతోంది.
  • ఈరోజు టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న పని, భవిష్యత్తులో అదే పంథా కొనసాగేందుకు దారి చూపుతుందన్న విషయం మరవొద్దు.
  • మాజీ ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వాధికారి కృష్ణమోహన్‌రెడ్డి అరెస్టులను ఖండిస్తున్నాం.
  • ఈ విషయంపై పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది. మాకు న్యాయస్థానాల మీద, ఆ వ్యవస్థ మీద నమ్మకం ఉంది.

అరెస్ట్  అమానుషం: నలమారు చంద్ర శేఖర్ రెడ్డి

కూటమి ప్రభుత్వం,గత ప్రభుత్వం మీద కోపంతో కావాలని రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా కొంతమంది ఐఏఎస్ ,ఐపీఎస్ మరియు ఇతర అధికారుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టడం అమానుషం.గత ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో కార్యదర్శి గా పని చేసి పదవీవిరమణ పొందిన మాజీ ఐఏఎస్ అధికారి కె.ధనంజయ రెడ్డి గారికి మరియు ఓఎస్డీ గా పనిచేసిన మాజీ రెవిన్యూ అధికారి కృష్ణమోహన్ రెడ్డి గారికి లిక్కర్ కేసుతో ఎలాంటి సంబంధం లేనప్పటికీ వారి మీద అకారణంగా కేసులుపెట్టి వారిని అరెస్టు చేయడం అన్యాయం. ఇలాగైతే ప్రభుత్వంలో అధికారులెవ్వరూ పని చెయ్యరు. ఇలా చేస్తే ప్రభుత్వ  అధికారులు ప్రభుత్వం మీద తిరగబడే రోజు త్వరలోనే వస్తుంది.   ఇలా అధికారుల మీద అనవసరంగా కేసులు పెట్టి అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. 

Back to Top