కాసేపట్లో వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

 
 తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ అధ్యక్షతన కాసేపట్లో తాడేపల్లిలో  వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు పాల్గొననున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

Back to Top