మహిళలను అడ్డుపెట్టుకొని బాబు నీచ రాజకీయం

రాజధానులంటే ముగ్గురు భార్యల వ్యవహారం కాదు పవన్‌

సుంకర పద్మావతి ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి

రియలెస్టేట్‌ వ్యాపారం కాపాడుకునేందుకే టీడీపీ ఆందోళనలు

సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయాలు దేశానికే ఆదర్శం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పద్మజ

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక మహిళలను అడ్డుపెట్టుకొని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి పద్మజ మండిపడ్డారు. సుంకర పద్మావతి ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పద్మజ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తీసుకున్న అనేక నిర్ణయాలు దేశ వ్యాప్తంగా ఉన్న అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. వీటన్నింటినీ చూసి సహించలేక మహిళలను అడ్డంపెట్టుకొని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడన్నారు. చంద్రబాబు హయాంలో మహిళలపై అరాచకాలు, అత్యాచారాలు విపరీతంగా జరిగాయన్నారు. సీఎం వైయస్‌ జగన్‌పై అవాకులు పేలితే సహించేది లేదన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు సమన్యాయం జరగాలని మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువస్తే ఏదో గందరగోళం జరిగిపోయితున్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నాడన్నారు. రాయలసీమకు హైకోర్టు రావడం మీకు ఇష్టం లేదా అని బాబును ప్రశ్నించారు. గోదావరి, పెన్నా అనుసంధానంగా బెనకచర్ల ద్వారా నీరు అందించే ప్రయత్నం తప్పుగా కనిపిస్తుందా..? వీటన్నింటికీ చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు హయాంలో గుంటూరు, కృష్ణా జిల్లాలకు అన్యాయం జరిగిందని టీడీపీ నేతలే అంటున్నారని గుర్తుచేశారు. చంద్రబాబు చేతగాని తనం కప్పిపుచ్చుకోవడానికి మహిళలను అడ్డంపెట్టుకొని నీచ ప్రయత్నాలకు తెరతీస్తున్నాడన్నారు.
 
రాజధాని తరలిపోవడం లేదని, రైతులకు ఎక్కడా అన్యాయం జరగడం లేదన్నారు. విశాఖపట్నంకు సెక్రటేరియట్, అమరావతిలో అసెంబ్లీ ఉండాల్సిన అవసరం లేదా..? అని ప్రశ్నించారు. భూదందా, రియలెస్టేట్‌ వ్యాపారం కాపాడుకోవడం కోసమే  మాత్రమే చంద్రబాబు ఆందోళనలు చేస్తున్నారన్నారు. సుంకర పద్మావతి ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేశారని, ఇటువంటి నాయకుల వల్ల కనీసం పేరు ఉచ్చరించడానికి ముందుకురారన్నారు.  

పవన్‌ కల్యాణ్‌ రాజధానుల గురించి మీటింగ్‌ పెట్టి ఏదేదో మాట్లాడుతున్నాడని,  మూడు రాజధానులు అంటే మూడు పెళ్లిళ్లు, ముగ్గురు పెళ్లాల విషయం కాదు.. అది ముగ్గురు అన్నదమ్ముల వ్యవహారంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

తాజా ఫోటోలు

Back to Top