అక్ర‌మ కేసుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేదు

కూట‌మి ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నిస్తూనే ఉంటాం 

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధులు ఆరె శ్యామ‌ల, వెంక‌ట్‌రెడ్డి 

క‌ర్నూలు:  ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నిస్తుంటే త‌మ‌పై అక్ర‌మ కేసులు పెడుతున్నార‌ని, అయినా ఇలాంటి కేసుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి ఆరె శ్యామ‌ల స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల క‌ర్నూలు స‌మీపంలో జ‌రిగిన బ‌స్సు ప్ర‌మాదంపై ప్ర‌శ్నించిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డం ప‌ట్ల శ్యామ‌ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆమె క‌ర్నూలులో వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి, ఎస్వీ మోహ‌న్‌రెడ్డిల‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. అనంత‌రం శ్యామ‌ల మీడియాతో మాట్లాడుతూ.. కర్నూలు బస్సు ప్రమాదం ప్ర‌శ్నించినందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌పై అక్రమ కేసులు నమోదు చేశారు. కూట‌మి పాల‌న‌లో మద్యం విచ్చలడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. హైవేలపై మద్యం షాపులను ఎందుకు ఏర్పాటు చేశారు. కర్నూలు సమీపంలోని లక్ష్మిపురం వద్ద బెల్టు షాపులు ఉన్న వాటిని ఎందుకు నియంత్రణ చేయ‌లేద‌ని ప్ర‌శ్నించాం. వీటికి స‌మాధానం చెప్పే ద‌మ్ము లేక త‌మ‌పై అక్ర‌మ కేసులు న‌మోదు చేశారు.  ఎన్ని కేసులు నమోదు చేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే ఉంటాం, వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి స్పూర్తితో  ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటాం` అని శ్యామ‌ల హెచ్చ‌రించారు.

బ‌స్సు ప్ర‌మాదంలో త‌ప్పెవ‌రిది:  వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి  
క‌ర్నూలు వ‌ద్ద‌ జ‌రిగిన బస్సు ప్రమాదానికి డ్రైవర్ల నిర్లక్ష్యమా, లేదా మద్యం సేవించిన వారిదా అని  తాము ప్రశ్నించామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి  పేర్కొన్నారు. బ‌స్సు ప్రమాదంపై ప్రశ్నించిన వాయిస్ ను పోలీసులు డిలిట్ చేయాలని కోరారు. కానీ తాము డిలిట్ చేయమని చెప్పామ‌ని తెలిపారు. 
ఈ కేసులో ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేసి పోలీసులు ప్రమాదంలో దగ్థం అయిన నెల గడుస్తున్న ఇప్పటికి ఓనర్‌పై కేసు నమోదు చేయలేద‌ని త‌ప్పుప‌ట్టారు. పోలీసుల విచారణంలో నాలుగు సీసాల మ‌ద్యం సేవించామని ఎర్రిస్వామి చెప్పార‌ని, కానీ ఇందులో పోలీసులు చెబుతున్న వీడియోలో కేవలం మూడు మద్యం సీసాలు కనిపిస్తున్నాయ‌ని తెలిపారు.  మిగిలిన మద్యం సీసా ఎక్కడి నుంచి తెచ్చార‌ని ప్ర‌శ్నించారు. అర్థరాత్రి లక్ష్మీపురంలోని బెల్టుషాపులో మద్యాన్ని కోనుగోలు చేశార‌ని తెలిపారు. రాష్ట్రంలో విచ్చవిడిగా మద్యం బెల్టుషాపులు వెలిశాయి. డిప్యూటి సీఎం స్థాయిలో పేకాట, బెల్టు షాపులు అక్రమ మద్యం పై ఫిర్యాదు చేశార‌ని గుర్తు చేశారు. రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో బెల్టు షాపుల ద్వారా న‌కిలీ మద్యం అమ్మకాలు సాగుతున్నాయ‌ని,   వీటిపై చర్యలు శున్యమ‌ని ఫైర్ అయ్యారు.

Back to Top