కూట‌మి పాల‌న‌లో అభివృద్ధి శూన్యం

జగనన్న చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్దాం

 వైయస్ఆర్ సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగ గ్లోబల్ కోఆర్డినేటర్ఆలూరు సాంబశివారెడ్డి  

తాడేప‌ల్లి:  11 నెల‌ల పాల‌న‌లో కూట‌మి ప్ర‌భుత్వం చేసిన అభివృద్ధి శూన్య‌మ‌ని  వైయస్ఆర్ సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగ గ్లోబల్ కోఆర్డినేటర్ఆలూరు సాంబశివారెడ్డి విమ‌ర్శించారు. అస్ట్రేలియాలో వైయ‌స్ఆర్‌సీపీ ఎన్ఆర్ఐ వింగ్ స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. `టీడీపీ, జనసేన విమర్శలే తప్ప వాళ్లేం చేశారో చెప్పుడానికి ఏమీ లేదు. అంతఃపుర రాజకోట రహస్యం లాంటిదే చంద్రబాబు అభివృద్ధి దేవతావస్త్రాల కథ. అభివృద్ధి అంటే చంద్రబాబు అంటూ జనాల్లోకి ప్రచారం చేశారు..చంద్రబాబు నడిచినా.. కూర్చున్నా అదే అభివృద్ధి అన్నట్టు తయారు చేశారు. వాస్తవమైన అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపింది మన ప్రభుత్వమే. మన గొంతు ద్వారా జగనన్న చేసిన అభివృద్ధి పనులను, మంచిని, సంస్కరణలను స్పష్టంగా చెప్పాలి. ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి.  వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు, హెల్త్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్, నాడునేడు, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం వంటి ఎన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి. వచ్చిన మెడికల్ కాలేజీలను కాలదన్నింది చంద్రబాబే. ఊర్లోనే సెక్రటేరియట్ ఉంటుందని ఎవరూ ఊహించలేదు. పారదర్శకంగా 2లక్షల కోట్లకుపైగా డీబీటీ చేసింది మన ప్రభుత్వ హయాంలోనే. 3,648 కి.మీ పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలు విని, వాటి పరిష్కారంగా మేనిఫెస్టోను తయారు చేశారు వైయస్ జగన్. ఏం చెబితే ప్రజలు ఓట్లేస్తారు అని ఆలోచించి తయారు చేసిన మేనిఫెస్టో కాదు వైయస్ఆర్ సీపీది. అబద్ధాలు చెప్పి, హామీలు గుప్పించాలని ఎందరో చెప్పినా వైయస్ జగన్ ఆపని చేయలేదు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిజాలు మాట్లాడటమే నూటికి నూరుశాతం ఉండాలన్నదే వైయస్ జగన్ సిద్ధాంతం. నేను చెప్పింది చేశాను, ఇంకా ఏమైనా చేయాలంటే చెప్పండి అని తన కార్యకర్తలను, ఎమ్మెల్యేలను, మంత్రులను గడపగడపకు పంపిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి` అని ఆలూరు సాంబశివారెడ్డి పేర్కొన్నారు.

Back to Top