రోడ్డు ప్ర‌మాదంలో సోష‌ల్ మీడియా కో-క‌న్వీన‌ర్ మృతి

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:  కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కో- కన్వీనర్ భాస్కర్ రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందాడు. భాస్క‌ర్ అకాల మ‌ర‌ణం ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షేక్ బాబా స‌లామ్‌, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు దిగ్భ్రాంతికి గుర‌య్యారు. పార్టీ కోసం భాస్క‌ర్ చేసిన నిస్వార్థ సేవ‌ను గుర్తు చేసుకుంటూ ఆయ‌న మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు.  భాస్క‌ర్ మృతి పార్టీకి తీరనిలోటు, ఆయ‌న  ఆత్మకి శాంతి చేకూరాలంటూ సోష‌ల్ మీడియాలో పార్టీ శ్రేణులు నివాళుల‌ర్పిస్తూ పోస్టు చేశారు.

Back to Top