`కూటమి` చేతగానితనంతోనే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీక‌ర‌ణ 

వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ ఫైర్‌

అనంత‌పురంలో వైయస్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా విభాగం ఆధ్వ‌ర్యంలో కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేతగానితనం తోనే మెడికల్ కాలేజీల ప్రవేటికరణ చేస్తోందని వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ మండిపడ్డారు.  ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ మాట్లాడుతూ.. నాడు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి , సంక్షేమం కోసం ఖర్చు చేసిన కూడా ప్రభుత్వ రంగ సంస్థలను ఏనాడు కూడా ప్రవేటికరణ ఆలోచన చేయని ముఖ్యమంత్రి గా వైయస్ జగన్ చరిత్ర సృష్టించారు అని కొనియాడారు. నేడు కూటమి ప్రభుత్వం లో ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకపోయినా కూడా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటికరణ చేస్తూ ప్రజాక్షేత్రం లో చరిత్రహీనులు గా మిగిలిపోయారు అని ధ్వజమెత్తారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం చేసేలా ఉన్న  కూటమి ప్రభుత్వ కుట్రను వైయస్ఆర్‌సీపీ కోటి సంతకాల సేకరణ ద్వారా భగ్నం కానున్నది అని ఆకాక్షించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంతకల్ పట్టణం లో వైయ‌స్ఆర్‌సీపీ పట్టణ అధ్యక్షుడు ఎండీఆర్‌ ఖలీల్ ఆధ్వ‌ర్యంలో కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేప‌ట్టారు. ఆయా కార్య‌క్ర‌మాల్లో వైయస్ఆర్‌సీపీ మేధావుల ఫోరమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టుబడి తానిషా, అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు  నైరుతిరెడ్డి , గుంతకల్లు మున్సిపల్ చైర్మన్  భవానీ  త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Back to Top