కేంద్ర ఆర్థిక మంత్రితో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీల భేటీ

ఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్‌తో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు భేటీ అయ్యారు. వైయ‌స్ఆర్ సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి, ఫ్లోర్ లీడ‌ర్ మిథున్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం కేంద్రమంత్రితో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాల‌ను కేంద్ర‌మంత్రితో చ‌ర్చించారు. పెండింగ్ స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని ఆమెను కోరారు. అదే విధంగా చేనేత కార్మికులకు పెంచిన జీఎస్టీని తగ్గించాలని, గతంలో మాదిరిగానే 5 శాతం కొనసాగించాలని వినతిపత్రం అంద‌జేశారు. ఈ స‌మావేశంలో ఎంపీలు వంగా గీతా విశ్వనాథ్, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి ఉన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top