బానిస పార్టీల నేతలెవరూ నోరు మెదపడం లేదు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

విశాఖ‌:  విజ‌య‌వాడ న‌గ‌రంలో టీడీపీ నేత తీరు కార‌ణంగా 14 ఏళ్ల బాలిక ఆత్మ‌హ‌త్య చేసుకుంటే బానిస పార్టీల నేతలెవరూ నోరు మెదపడం లేదని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్టీ పార్ల‌మెంట‌రీ నేత వి.విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు సోమవారం విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.  చంద్రబాబు ఉస్కో అనగానే స్వల్ప ఘటనలపై కూడా నానా రచ్చ చేసే  బానిస పార్టీల నేతలెవరూ14 ఏళ్ల బాలిక ఆత్మహత్యపై నోరు మెదపడం లేదు. పసి పిల్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన పశువు టీడీపి నేత వినోద్ జైన్ ను బహిరంగంగా ఉరితీస్తే తప్ప ఇలాంటి ఘటనలు ఆగవంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

Back to Top