గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన బావమరిది బాలకృష్ణకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. బాలకృష్ణ ఎమ్మెల్యేగానే కాదు.. నటుడిగానూ అసమర్థుడన్నారు. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి, అర్హత బాలకృష్ణకు లేదన్నారు. బాలకృష్ణ లాంటి మెదడు లేని వ్యక్తి ఈదేశంలోనే లేడన్నారు. చంద్రబాబు ఇక ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు నైజం ఏంటో ప్రజలకు బాగా తెలుసన్నారు. పప్పునాయుడుకు దమ్ముంటే అవినీతిని బయటపెట్టాలని సవాల్ విసిరారు. చంద్రబాబు, లోకేష్‌లే అవినీతి, కుంభకోణాలకు పాల్పడ్డారని, అందుకే 2019లో ప్రజలు బుద్ధిచెప్పి పంపించారని గుర్తుచేశారు.