నమ్మకద్రోహం పురందేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉంది

బీజేపీ అధ్యక్షురాలైనా బావ పార్టీ టీడీపీ సేవలో తరిస్తోంది

వైయ‌స్ఆర్ సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్లు

తాడేప‌ల్లి: ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది పురందేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్రావులే అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. ఈ మేర‌కు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా పురందేశ్వ‌రి తీరును గూర్చి ప్ర‌స్తావించారు.

నమ్మకద్రోహం అనేది పురందేశ్వరి గారి వ్యక్తిత్వంలోనే ఉంది. తండ్రిని కాటికి పంపిన వ్యక్తికి పార్టీలు మారడం ఒక లెక్కా. కేంద్రంలో  ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారింది. ఇప్పుడు పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా బావ పార్టీ టీడీపీ సేవలో తరిస్తోంది. ఇలాంటి వారినే మోసగాళ్లకు మోసగాళ్లు అంటారు.

ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది పురందేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్రావులే. ఎమ్మెల్యేలు వెంటలేకున్నా అంతా తన వైపు వచ్చారని బాబు ఎల్లో మీడియాలో రాయించుకోవడం ఒక ఎత్తయితే, ఎన్టీఆర్ కుమారులను తండ్రిపైకి ఉసిగొల్పిన ఘనచరిత్ర పురందేశ్వరిది.  

సిగ్గు విడిచి పదవీ కాంక్షతో అప్పట్లో బాబుగారి ఇంటికి వెళితే తలుపులు తెరవకుండా తరిమికొట్టినా మళ్లీ ఆయన పల్లకి మోస్తున్నారు ఈ ఆదర్శ దంపతులు. 

"అన్న టీడీపీ" అనే పార్టీని పురందేశ్వరి ప్రేరేపించి హరికృష్ణ చేత ప్రారంభించి, తనే కొబ్బరికాయ కొట్టి, కొంతకాలం గౌరవ అధ్యక్షురాలిగా పనిచేసి, ఆ పార్టీ ఓడిపోవటంతో కాంగ్రెస్ లో చేరి సోనియాగాంధీని పొగడ్తలతో ముంచెత్తిన ఘనురాలు ఈవిడ.

https://x.com/VSReddy_MP/status/1721384447034167671?s=20

Back to Top