విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో సమస్యలపై పోరాటం చేస్తామని వైయస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకున్నామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు చేతులెత్తేశారన్నారు. రెండు లక్షల కోట్ల విలువచేసే స్టీల్ ప్లాంట్‌ను కారు చౌకగా అమ్మే ప్రయత్నం చేస్తున్నారని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమని మరోసారి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో ఏర్పాటు చేసే ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయాన్ని చంద్రబాబు విజయవాడకు తీసుకెళ్లారు. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే మా ఉద్దేశ్యం. త్వరలో ఉత్తరాంధ్రలో ఉన్న 34 అసెంబ్లీ స్థానాలు 44 స్థానాలకు పెరగనున్నాయి. ఉత్తరాంధ్రలో అన్ని స్థానాలను గెలుచుకుంటాము. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాము. వారికి ఎటువంటి కష్టం రానివ్వమని విజయసాయిరెడ్డి తెలిపారు.