ప్రకాశం జిల్లా: త్వరలో నియోజకవర్గాల సమన్వయకర్తల నాలుగో జాబితా విడుదల చేస్తామని వైయస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ రీజనల్ కోర్దినేటర్ విజయసాయిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ..బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి ఎలాంటి సమస్య లేదని.. పార్టీలో ఆయన అత్యంత విలువైన నాయకుడని అన్నారు. పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యం తగ్గదని, బాలినేని స్థానం ఆయనకు ఉంటుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు దొంగ ఓట్లను ఎలా చేర్చుకున్నది.. ఎలా మేనేజ్ చేస్తున్నది ఆధారాలతో సహ ఎలక్షన్ కమిషన్‌కు వివరించాం. రాజకీయ పార్టీలలో విమర్శలు-ప్రతి విమర్శలు సహజం. కానీ.. పార్టీ అధినేతను ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే పార్టీలో ఉన్న ఏ వ్యక్తి అయినా స్పందించవలసిన బాధ్యత ఉంది. తిట్టమని చెప్పడం తప్పు. మీడియాతో పాటు తెలుగుదేశం పార్టీ ఆ పదాన్ని ఎందుకు వాడుతుందో తెలియదు. కావాలనే వాళ్లంతా దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.