పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా జరగాలి

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజయసాయిరెడ్డి ట్వీట్‌

  ఢిల్లీ: నేటి(గురువారం) నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ బిల్లులపై నిర్మాణాత్మక చర్చ అవసరం అంటూ కామెంట్స్‌ చేశారు.  ‘ఈరోజు నుంచి ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు అ‍త్యంత ఉత్పాదకతతో సాగుతాయని ఆశిస్తున్నాను. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా జరగాలి. ప్రభుత్వ బిల్లులపై నిర్మాణాత్మక చర్చ అవసరం. ప్రత్యేకించి రైతులు, మహిళల సమస్యలపై ప్రత్యేక చర్చ జరగాలి’ అని కోరుకుంటున్నట్టు స్పష్టం చేశారు.  

Back to Top