తాడేపల్లి: నీటి విలువ తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే.. కరువు సీమను మెతుకు సీమగా మారుస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ.. `కరువు ప్రాంతంలో నీటి విలువ తెలిసిన వ్యక్తి సీఎంగా ఉన్నారు కాబట్టే ఇరిగేషన్ పై ఇంత ధ్యాస. గండికోట, చిత్రావతి ప్రాజెక్టులు నిండాయి - కరువు సీమను మెతుకు సీమగా మారుస్తున్నారు. నెల్లూరు సహా రాయలసీమ బీడు బీముల్లో నీరు పారుతోంది. నిర్వాసితుల త్యాగాలనూ గుర్తుపెట్టుకుంటోంది ప్రభుత్వం` అని ట్వీట్ చేశారు. అదే విధంగా `ఇళ్ల పట్టాల పంపిణీ మహా సంకల్పాన్ని దేశమంతా ప్రశంసిస్తుంటే పచ్చ పార్టీ వరదలు పారేలా కన్నీరు కారుస్తోంది. మెచ్చుకునే గొప్ప గుణం లేకపోతే మిన్నకుండాలి గానీ ఈ హాహాకారాలు మాత్రం మంచిది కాదు. మహిళా స్వావలంబనలో అతి పెద్ద ముందడుగు పడింది. ఇంకా కొనసాగిస్తారు యువ సీఎం` అని మరో ట్వీట్ చేశారు.