అశోక్‌ గజపతిరాజు ధర్మకర్తా..? అధర్మకర్తా..?

సుమారు 846 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారు

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజం

విశాఖపట్నం: సింహాచలం దేవస్థాన ఆస్తులను కాపాడుతామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. సింహాద్రి అప్పన్నను ఎంపీ విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ పేరుతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అశోక్‌ గజపతి రాజు మాన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌గా ఉన్నప్పుడు దేవస్థానానికి సంబంధించి రూ. 8 వేల కోట్లు దోచుకున్నారని, సుమారు 846 ఎకరాలు పరాధీనంపాలైతే అశోక్‌ గజపతి రాజు ప్రేక్షకపాత్ర వహించాడా..? లేక స్వయంగా ఆయన కూడా భాగస్వామా..? తేలాల్సి ఉందన్నారు. వంశపారంపర్య ధర్మకర్తగా పిలచుకుంటున్న అశోక్‌ గజపతిరాజు ధర్మకర్తా..? అధర్మకర్తా..? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. త్వరలోనే భూ సమస్యను పరిష్కారిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top