ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ తనుజారాణి
 

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్‌సభలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ తనుజారాణి కోరారు. రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన కోసం వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం చేస్తోంది.  లోక్‌సభలో ఎంపీ తనుజారాణి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు.

‘‘టీపీపీ బలంపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నా ప్రత్యేక హోదా ఆ పార్టీ అడగడం లేదు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, పార్టీ ఆఫీసులపై టీడీపీ దాడులు మానుకోవాలి. గిరిజనుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో విద్యాబోధనకు గిరిజనేతర టీచర్లు రావడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలి.  ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలని గత పదేళ్లుగా వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్‌ చేస్తునే ఉంది. ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా  ఇవ్వాలి ’’ అని ఆమె అన్నారు. 

Back to Top