వరదలతో నష్టపోయిన జిల్లాలను ఆదుకోండి

లోక్‌స‌భ‌లో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి

న్యూఢిల్లీ: వరదల వల్ల భారీ న‌ష్టం వాటిల్లింద‌ని, బాగా న‌ష్ట‌పోయిన‌ వైయ‌స్ఆర్‌ కడప, చిత్తూరు జిల్లాలను కేంద్ర ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి లోక్‌సభలో ప్ర‌స్తావించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి వరదలతో నష్టపోయిన ప్రాంతాలకు కేంద్రం సాయం చేయాలని కోరారని మిథున్‌రెడ్డి గుర్తుచేశారు. ఇప్పటికే వరద నష్టాన్ని అంచనా వేయటానికి కేంద్ర ప్రభుత్వం రెండు బృందాలను పంపిందన్నారు. వ‌ర‌ద‌ల వ‌ల్ల న‌ష్ట‌పోయిన జిల్లాల‌ను ఆదుకోవ‌డానికి తక్షణమే కేంద్ర ప్రభుత్వం సాయం అందజేయాలని ఎంపీ మిథున్‌రెడ్డి కోరారు.

తాజా వీడియోలు

Back to Top