కష్టం విలువ తెలిసిన వ్యక్తిని..మీ అందరి ఆశీస్సులు కావాలి

వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తి

తిరుపతి: కష్టం విలువ తెలిసిన వ్యక్తినని,  పార్లమెంట్‌ ఉప ఎన్నికలో ప్రజలందరి ఆశీస్సులు తనకు కావాలని వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంట్‌ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తి కోరారు. గురువారం తిరుపతిలోని పార్టీ కార్యాలయంలో మంత్రి పేర్నినాని, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి గురుమూర్తి మీడియాతో మాట్లాడారు. తిరుపతి పార్లమెంట్‌ ప్రజల చల్లని దీవెనలు, ఆశీస్సులు తనకు కావాలన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి దీవించాలని కోరారు. నేను మీ అందరిలో ఒక్కడిని, అందరికీ సుపరిచితుడనే..సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. కష్టం విలువ తెలుసు కాబట్టి..ప్రతి సమస్యపై స్పందించి వీలైన మేరకు సమస్య పరిష్కారానికి అందరి సహకారంతో ముందుకు వెళ్తానని చెప్పారు. మీ అందరి సహకారం, సహాయం ఉండాలని కోరారు. ఈ నెల 17న ప్రతి ఒక్కరూ తమ ఓటును ఫ్యాన్‌ గుర్తుపై ముద్రించాలి. మీరు కాదు.. మిగతా వారిని కూడా చైతన్యవంతం చేసి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయించాలని గురుమూర్తి కోరారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top