విశ్వసనీయత లేని నాయకుడు చంద్రబాబు

2024 ఎన్నికల్లో  వైయ‌స్ఆర్‌ సీపీదే విజ‌యం

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయేల్‌

ప‌శ్చిమ గోదావ‌రి:  చంద్ర‌బాబు విశ్వ‌స‌నీయ‌త లేని నాయ‌కుడ‌ని, ప్రజల్లో ఆయ‌న‌ పూర్తిగా నమ్మకం కోల్పోయార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయేలు అన్నారు.  ప్రజలను మభ్యపెట్టేందుకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నారని మండిప‌డ్డారు. చంద్రబాబు, లోకేశ్‌ కులాలు, కుటుంబా­ల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి దిగజారార‌ని విమ‌ర్శించారు. టీడీపీని గెలిపించండి చౌకగా మద్యం అందిస్తానని’ సిగ్గు, ఎగ్గులేకుండా చంద్రబాబు ఓట్లు అడుగుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. దేశంలోనే బాబు లాంటి నీచమైన నాయకుడిని చూడమ‌న్నారు. కులాల పేరెత్తి మాట్లాడటం, ఇంత నీచానికి దిగజారడం అవసరమా? బాబు అంటూ నిల‌దీశారు. ధైర్యముంటే సీఎంగా బాబు ఏం చేశారో చెప్పాల‌ని స‌వాలు విసిరారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలి, అంతేకానీ దిగజారి మాట్లాడటం ఎంత వరకూ సమంజసం? అని ఇజ్రాయేలు ప్ర‌శ్నించారు. బాబు తన సభల్లో  2014 ఎన్నికల మేనిఫెస్టో తీసుకుని ప్రజలకు చూపిస్తూ వీటిలో నేను చెప్పినవి అన్నీ చేశానని ప్రజలకు చదవి వినిపించాలి. అప్పుడు ఆయన క్రెడిబిలిటీ, నిజాయితీ ప్రజలకు తెలుస్తుంది. వైనాట్‌ 175 అనేదే మా టార్గెట్‌. మా నాయకుడి ధైర్యమే మా ధైర్యం..2024 ఎన్నికల్లో  వైయ‌స్ఆర్‌ సీపీదే విజ‌య‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Back to Top