నేడు వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌

కాసేపట్లో పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా బీఫాంలు అందుకోనున్న అభ్యర్థులు

తాడేపల్లి: ఎమ్మెల్యే కోటాకు సంబంధించి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మరికాసేపట్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను కలిసి బీఫాంలు అందుకోనున్నారు. అనంతరం భారీ ర్యాలీగా బయల్దేరి అసెంబ్లీ కార్యాల‌యంలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులు పెనుమత్స సూర్యనారాయణ రాజు, కోలా గురువులు, ఇజ్రాయిల్, మ‌ర్రి రాజశేఖర్, జయమంగళం వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నం నామినేషన్లు వేయనున్నారు.  

Back to Top