ప్ర‌భుత్వ అస‌మ‌ర్ధ‌త వ‌ల్లే రేష‌న్ బియ్యం అక్ర‌మ ర‌వాణా

మండ‌లిలో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఫైర్‌

అమ‌రావ‌తి:  కూట‌మి ప్ర‌భుత్వ అస‌మ‌ర్ధ‌త వ‌ల్లే రేష‌న్‌బియ్యం అక్ర‌మంగా ర‌వాణా జ‌రుగుతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మండిప‌డ్డారు. బుధ‌వారం శాస‌న మండ‌లిలో ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌పై జ‌రిగిన చ‌ర్చ‌లో ప్ర‌భుత్వ‌తీరును ఆయ‌న ఎంగ‌డ‌ట్టారు. ఇజ్రాయిల్ మాట్లాడుతూ..`ప్రజా పంపిణీ ద్వారా ప్రజలకు అందాల్సిన బియ్యం రేషన్ షాప్ డీలర్లు, అధికారులు కుమ్మక్కై వేల మెట్రిక్ టన్నులు రాష్ట్రం దాటిస్తున్నారు. కాకినాడ, విశాఖపట్నం, బాపట్లలో అక్రమ రవాణా ఎక్కువ జరుగుతుంది.  పేదలకు అందాల్సిన బియ్యం అక్రమంగా తరలిపోతోంది. కాకినాడలో పవన్ కళ్యాణ్ షిజ్ ద షిప్ ఏమైంది?  రేషన్ డీలర్ నుంచి 15 రూపాయలకు కొన్న బియ్యాన్ని బయట మార్కెట్లో కిలో 25 రూపాయలకు అమ్ముతున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ హయాంలో ఇంత మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమ తరలింపు ఎప్పుడూ జరగలేదు. ఏడాది కాలంలోనే వేల మెట్రిక్ టన్నుల బియ్యం పట్టుకున్నారంటే అవినీతి ఏ విధంగా జరుగుతుందో అర్థ‌మ‌వుతుంది` అని ఇజ్రాయిల్ పేర్కొన్నారు.

Back to Top